Chor Bazaar: ఆకాష్ పూరి హీరోగా ఆయన రూపొందించిన కొత్త సినిమా "చోర్ బజార్". దళం, జార్జ్ రెడ్డి చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జీవన్ రెడ్డి రూపొందిస్తున్న ఈ సినిమాలో గెహనా సిప్పీ నాయికగా నటించింది. ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
Chor Bazaar: ఆకాష్ పూరి హీరోగా ఆయన రూపొందించిన కొత్త సినిమా "చోర్ బజార్". దళం, జార్జ్ రెడ్డి చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జీవన్ రెడ్డి రూపొందిస్తున్న ఈ సినిమాలో గెహనా సిప్పీ నాయికగా నటించింది. ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
దళం, జార్జ్ రెడ్డి చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు జీవన్ రెడ్డి (Jeevan Reddy). ఆకాష్ పూరి (Akash Puri) హీరోగా ఆయన రూపొందించిన కొత్త సినిమా "చోర్ బజార్". గెహనా సిప్పీ నాయికగా నటించింది. యూవీ క్రియేషన్స్ సంస్థ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాసే చిత్రాలన్నీ మాస్ ఎంటర్ టైనర్సే. చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేకుండా ఈ జానర్ సినిమాలన్నింటినీ ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా ప్రేక్షకులతో ఈలలు వేయించేందుకు శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమా చోర్ బజార్ (Chor Bazaar) మరికొద్ది గంటల్లో తెరపైకి వచ్చేందుకు రెడీ అవుతుండగా.. తాజాగా రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు.
ఈ రిలీజ్ ట్రైలర్ చూస్తే.. వజ్రాన్ని దొంగలు కొట్టేయడం, అది చోర్ బజార్ కు చేరడం, పోలీసులు చేసిన హంగామా, బచ్చన్ సాబ్ ఉన్నంతవరకు చోర్ బజార్ ను ఏం చేయలేమని విలన్స్ మాట్లాడుకోవడం, చివరకు చోర్ బజార్ ను మూసేయాలని కొందరి ప్లానింగ్ వర్కవుట్ అవడం..కోర్టు ఆర్డర్స్ తో చోర్ బజార్ ను మూసేసిన ఎమోషనల్ షాట్స్..బచ్చన్ సాబ్ ను పట్టుకోవడం కష్టమే కాదు అసాధ్యమని ఆకాష్ చెప్పిన మాస్ డైలాగ్స్ తో నింపేసిన ఈ ట్రైలర్ సినిమా ఫస్ట్ షో చూసేయాలి అన్నంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. మధ్యలో వచ్చిన మాస్ సాంగ్ బిట్ బీ, సీ సెంటర్లకు సినిమాను క్యాటర్ చేసేలా ఉంది.
ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో గెహనా సిప్పీ నాయికగా నటించింది. డైరెక్టర్ జీవన్ రెడ్డి తెరకెక్కించారు. ఆయన ఫస్ట్ ఇలాంటి మాస్ మూవీ చేశారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. ఆకాష్ పూరికి కెరీర్ లో ఒక డిఫరెంట్ మూవీగా చోర్ బజార్ నిలుస్తుందని అంచనాలు ఏర్పడుతున్నాయి.
చోర్ బజార్లో నేను చూసిన మనుషులు రాత్రంతా బిజినెస్ చేసి, పగలు నిద్రపోతుంటారు. పగలో జీవితం, రాత్రి మరో జీవితం గడుపుతుటారు. ప్రతి ఒక్కరూ ఒక్కో హీరోను అభిమానిస్తారు. ఆ స్ఫూర్తితోనే మా చిత్రంలో హీరోకు బచ్చన్ సాబ్ అనే పేరు పెట్టాం. రికార్డుల కోసం తాను చేసే వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ సినిమాలో పాత్రలన్నీ సహజత్వానికి దగ్గరగా ఉంటూ ఫుల్ కమర్షియల్గా సాగుతుంటాయి అన్నారు దర్శకుడు జీవన్ రెడ్డి.
Published by:Sunil Boddula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.