Chor Bazaar : లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న "చోర్ బజార్" సినిమా ట్రైలర్ ఇటీవల బాలకృష్ణ చేతులమీదుగా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మంచి బజ్‌లో వస్తున్న ఈ సినిమా జూన్ 24న విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌లో ఇప్పటికే పలు పాటలు కూడా విడుదలై మంచి ఆదరణ పొందాయి. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్‌ను పూర్తి చేసుకుంది.
Chor Bazaar : ఆకాష్ పూరీ (Akash Puri ) హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’(Chor Bazaar). గెహన సిప్పీ నాయికగా నటిస్తున్నారు. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి (Jeevan Reddy) ఈ సినిమాను తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు (VS Raju) నిర్మించిన ఈ సినిమా యూవీ క్రియేషన్స్ (UV Creations) సమర్పణలో వస్తోంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న "చోర్ బజార్" సినిమా ట్రైలర్ ఇటీవల బాలకృష్ణ చేతులమీదుగా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మంచి బజ్‌లో వస్తున్న ఈ సినిమా జూన్ 24న విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌లో ఇప్పటికే పలు పాటలు కూడా విడుదలై మంచి ఆదరణ పొందాయి. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించి సినిమా టీమ్ ఓ పోస్టర్‌ను విడదుల చేసింది. ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకున్నట్టుగా తెలిపారు. ఈ చిత్రానికి యూ / ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు తెలిపారు. ఇక ఈ చిత్రానికి సురేష్ బొబ్బొలి సంగీతం అందించారు. జూన్ 24న ఈ చిత్రాన్ని ప్రముఖ బ్యానర్ యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేస్తోంది.
ఇక ఈ‘‘చోర్ బజార్’’ సినిమాలోని 'బచ్చన్ సాబ్ ఫ్యాన్ ఆంథమ్' లిరికల్ సాంగ్ (Bachchan Saab Fan anthem)ను ఆయన ఇటీవల విడుదల చేశారు. 'బచ్చన్ సాబ్ ఫ్యాన్ ఆంథమ్' బాగుందని, ‘‘చోర్ బజార్’’ సినిమా హిట్ అవ్వాలని ఆయన విషెస్ తెలిపారు. 'బచ్చన్ సాబ్ ఫ్యాన్ ఆంథమ్' పాటను మదీన్ ఎస్కే స్వరకల్పనలో మిట్టపల్లి సురేందర్ సాహిత్యాన్ని అందించగా మంగ్లీ పాడారు.
ఇక పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ గత సినిమా రొమాంటిక్ మూవీ బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ నిర్మాణంలో అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా యూత్ ఆడియన్స్‌ను అలరించింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ మరో ముఖ్యపాత్రలో నటించారు.
#Chorbazaar grand release on June 24 in theatres near you..
చోర్ బజార్ సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ - జగదీష్ చీకటి, సంగీతం - సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్ - అన్వర్ అలీ, ప్రభు దేవా, ఆర్ట్ - గాంధీ నడికుడికర్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం సౌండ్ డిజైనర్ : సాయి మనీందర్ రెడ్డి, ఆడియో - లహరి, కాస్ట్యూమ్స్ డిజైనర్ - ప్రసన్న దంతులూరి, ఫైట్స్ - ఫృథ్వీ శేఖర్, కొరియోగ్రఫీ - భాను, పబ్లిసిటీ డిజైనర్ - అనిల్ భాను , స్టిల్స్ : వికాస్ సీగు, పి.ఆర్.వో - జీఎస్కే మీడియా, మేకప్ - శివ, కాస్ట్యూమ్ చీఫ్ - లోకేష్, డిజిటల్ మీడియా - వాల్స్ అండ్ ట్రెండ్స్, సహ నిర్మాత - అల్లూరి సురేష్ వర్మ, బ్యానర్ - ఐ.వి ప్రొడక్షన్స్, నిర్మాత - వీ.ఎస్ రాజు, రచన, దర్శకత్వం - బి. జీవన్ రెడ్డి.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.