హోమ్ /వార్తలు /సినిమా /

Nenevaru: ఆకాష్ పూరి చేతుల మీదుగా నేనెవరు ఆడియో లాంచ్

Nenevaru: ఆకాష్ పూరి చేతుల మీదుగా నేనెవరు ఆడియో లాంచ్

Nenevaru (Photo Twitter)

Nenevaru (Photo Twitter)

Akash Puri: ప్రముఖ ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరోగా నటిస్తున్న నేనెవరు సినిమా నుంచి తాజాగా ఆడియో లాంచ్ చేశారు. ఈ వేడుకకు యువ హీరోలు ఆకాష్ పూరి, రాహుల్ విజయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివ ప్రసాద్, తన్నీరు రాంబాబు నిర్మాతలుగా నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం వహించిన చిత్రం 'నేనెవరు' (Nenevaru). పూనమ్ చంద్, కుమావత్, కిరణ్ కుమార్ మోటూరి ఈ సినిమాకు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ (Kola Balakrishna) హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. తనిష్క్ రాజన్, గీత్ షా సహాయ పాత్రల్లో, బాహుబలి ప్రభాకర్ విలన్ గా నటిస్తున్నారు. రాధ గోపి తనయుడు ఆర్.జి.సారథి ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి.ఎస్.రావు తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఆడియో అండ్ ప్రోమో రిలీజ్ చేశారు. ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగిన వేడుకలో యువ హీరోలు ఆకాష్ పూరి, రాహుల్ విజయ్ పాల్గొని ఈ ఆడియో అండ్ ప్రోమో విడుదల చేశారు. సీనియర్ నటులు గౌతమ్ రాజు, అశోక్ కుమార్, ప్రముఖ రచయిత నివాస్, నాగబాల సురేష్ కుమార్, రాధ గోపి, సుప్రీంకోర్టు న్యాయవాది వరప్రసాద్, ఆదిత్య ప్రతినిధులు నిరంజన్, మాధవ్ తదితరులు హాజరైన ఈ వేడుకలో ఫస్ట్ గ్లింప్స్ కూడా విడుదల చేశారు.

దర్శకుడిగా నిర్ణయ్ కి, సంగీత దర్శకుడు సారథికి, హీరో బాలకృష్ణకి, నిర్మాతలకు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని హీరోలు ఆకాష్ పూరి, రాహుల్ విజయ్ ఆకాంక్షించారు. ఈ చిత్రం ఆడియో హక్కులు ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది. ఎడిటర్ గా కోలా భాస్కర్ చివరి చిత్రం "నేనెవరు" కావడం విశేషం. ఈ చిత్రానికి కెమెరా వర్క్ సామల భాస్కర్ చేయగా.. కోలా భాస్కర్ ఎడిటింగ్ వర్క్స్ చేస్తున్నారు. రియల్ సతీష్ ఫైట్స్ కంపోజ్ చేయగా చంద్రకిరణ్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. అతిత్వరలో ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్, మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు మేకర్స్.

Published by:Sunil Boddula
First published:

Tags: Tollywood, Tollywood actor, Tollywood Cinema

ఉత్తమ కథలు