AJITH WIFE SHALINI AJITH SHOCKED EVERYONE WITH HER CELL PHONE AND DO YOU KNOW THE PRICE PK
అజిత్ భార్య షాలిని ఫోన్ మోడల్ ఏంటో తెలుసా.. చూస్తే షాక్ తప్పదు..
అజిత్ కుమార్ షాలిని
అజిత్ కుమార్.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. తెలుగులో కూడా ఈయనకు అభిమానులున్నారు. కాకపోతే సినిమాలే విజయం సాధించవంతే. కానీ వ్యక్తిగా అజిత్ ను అభిమానించే వాళ్లు మన దగ్గర కూడా చాలా మందే ఉన్నారు.
అజిత్ కుమార్.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. తెలుగులో కూడా ఈయనకు అభిమానులున్నారు. కాకపోతే సినిమాలే విజయం సాధించవంతే. కానీ వ్యక్తిగా అజిత్ ను అభిమానించే వాళ్లు మన దగ్గర కూడా చాలా మందే ఉన్నారు. ఒక్కో సినిమాకు కనీసం 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడు ఈయన. అలాంటిది అజిత్ వాడే ప్రతీ వస్తువు రేంజ్ ఎలా ఉండాలి..? ఇక ఆయన ఇంట్లో వాళ్లు ఎంత హై రేంజ్లో ఉండాలి.. కానీ ఇప్పుడు అజిత్ భార్య షాలిని మాత్రం అభిమానులకే కాదు ప్రేక్షకలకు కూడా ఊహించని షాక్ ఇచ్చింది.
అజిత్ కుమార్ షాలిని
తాజాగా పిల్లల రక్షణకు సంబంధించిన ఓ వేడుకకు వచ్చిన షాలిని.. అక్కడ అందర్లోనూ హైలైట్ అయింది. దానికి కారణం ఆమె చేతిలో ఉన్న మొబైల్ ఫోన్. నిజం.. ఆ ఒక్క ఫోన్ తోనే అక్కడ షాలిని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది. ఎందుకు.. ఆ ఫోన్ అంత కాస్ట్ లీనా అనుకుంటున్నారా.. అలా అనుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే షాలిని వాడుతున్న ఫోన్ కేవలం 3 వేలు మాత్రమే.. అవును నమ్మడానికి కష్టంగా ఉన్నా కూడా ఇదే నిజం.
షాలిని అజిత్ కుమార్
బేసిక్ మోడల్ ఫోన్ వాడుతుంది అజిత్ భార్య. ఓ సూపర్ స్టార్ భార్య అయి ఉండి అలాంటి ఫోన్ వాడటం ఏంటి అని అంతా షాక్ అయ్యారు. ఈ రోజు రేపు ఎవరు పడితే వాళ్లు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు.. అలాంటిది షాలిని మాత్రం బేసిక్ నోకియా పీచర్ ఫోన్ వాడుతుండటం నిజంగా ఆశ్చర్యమే. ఆమెకు ఈ ఫోన్లపై పెద్దగా ఆసక్తి లేదు.. ఒకవేళ ఉండుంటే మార్కెట్లోకి వచ్చిన ప్రతీ కొత్త మొబైలో కొనే సత్తా ఆమెకు ఉంది.
అజిత్ కుమార్
అజిత్ కూడా ఇంతే సింపుల్ లైఫ్ లీడ్ చేస్తాడు. తన వాళ్ల కోసం ఏదైనా చేస్తాడు.. ఆ మధ్య తన స్టాఫ్ కు ఏకంగా 80 ఇళ్లు కట్టించాడు. ఇప్పుడు షాలిని కూడా పిల్లలకు సాయం చేస్తుంది. మొత్తానికి సినిమాల్లోనే బయట కూడా హీరో అనిపించుకోవడం మాత్రం నిజంగా చాలా తక్కువ మందికే సాధ్యమవుతుంది. అందులో అజిత్ కూడా ఒకరు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.