Home /News /movies /

AJITH VISHWASAM TELUGU DUBBING VERSION RELEASE VERY SOON TA

రజినీ అయిపోయాడు..ఇపుడు అజిత్ వంతు వచ్చిందిగా..

అజిత్ రజినీకాంత్

అజిత్ రజినీకాంత్

Ajith Vishwasam, Rajinikanth Peta | అవును ఇపుడు రజినీకాంత్ తాను యాక్ట్ చేసిన ‘పేట’ సినిమాతో తెలుగులో ఆడియన్స్‌ను పలకరించాడు. ఇపుడు అజిత్ ‘విశ్వాసం’ సినిమాతో తెలుగు ఆడియన్స్‌ను పలకరించబోతున్నాడు.

అవును ఇపుడు రజినీకాంత్ తాను యాక్ట్ చేసిన ‘పేట’ సినిమాతో తెలుగులో ఆడియన్స్‌ను పలకరించాడు. కానీ అనుకున్న సక్సెస్ మాత్రం రాలేదు. ఇక తమిళనాడులో తలైవా సినిమాకు పోటీగా అజిత్ హీరోగా నటించిన ‘విశ్వాసం’ సినిమా విడుదలైంది.

ఈ పొంగల్ పోటీలో రజినీకాంత్..‘పేట’ను తన సినిమా ‘విశ్వాసం’తో క్రాస్ చేసాడు అజిత్. తమిళంలో సూపర్ హిట్టైన ఈసినిమాను ఇపుడు తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఐతే తమిళంలో విడుదలైన రోజునే తెలుగు డబ్బింగ్ ఇక్కడ విడుదల చేయానులకున్నారు. అప్పటికే చాలా సినిమాలు పోటీలో ఉండటం..పైగా థియేటర్స్ కొరత వల్ల ఇక్కడ విడుదల చేయలేకపోయారు.

ఇపుడు ‘విశ్వాసం’ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ను ఫిబ్రవరి 1న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాలో అజిత్‌కు విలన్‌గా జగపతిబాబు యాక్ట్ చేసాడు. మొత్తానికి తమిళ ప్రజల విశ్వాసం పొందిన ఈ సినిమా తెలుగు ప్రజల ‘విశ్వాసం’ ఎంత మేరకు అందుకుంటుందో చూడాలి.

లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై లక్ష్మి పార్వతి కామెంట్స్

ఇవి కూడా చదవండి 

బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య మళ్లీ మొదలైన కోల్డ్ వార్..

‘యాత్ర’ కోసం నాల్గోసారి ఆ పని చేసిన మమ్ముట్టి

అటు కొరటాల శివ.. ఇటు త్రివిక్రమ్ శ్రీనివాస్.. మధ్యలో చిరంజీవి..
First published:

Tags: Ajith, Kollywood, Rajinikanth, Tamil Cinema

తదుపరి వార్తలు