హోమ్ /వార్తలు /సినిమా /

అజిత్ ‘విశ్వాసం’ మోషన్ పోస్టర్ రిలీజ్

అజిత్ ‘విశ్వాసం’ మోషన్ పోస్టర్ రిలీజ్

అజిత్ విశ్వాసం మూవీ (ట్విట్టర్ ఫోటో)

అజిత్ విశ్వాసం మూవీ (ట్విట్టర్ ఫోటో)

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, దర్శకుడు శివ కలయికలో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘విశ్వాసం’. తాజాగా  మూవీని నుంచి మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అంతేకాదు ఈ మూవీని వచ్చే యేడాది జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టు ఈ మోషన్ పోస్టర్‌లో అఫీషియల్‌గా ప్రకటించారు.

ఇంకా చదవండి ...

  కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, దర్శకుడు శివ కలయికలో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘విశ్వాసం’. వీళ్లిద్దిరి కలయికలో వచ్చిన ‘వీరం’, ‘వేదాలం’, ‘వివేగం’ చిత్రాలు మంచి సక్సెస్ సాధించాయి. ఇపుడు ‘విశ్వాసం’ కోసం నాల్గోసారి కలిసి పనిచేస్తున్నారు.

  ఇప్పటికే తల అజిత్ నటిస్తోన్న ‘విశ్వాసం’ మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ ఎంటర్టేననర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో అజిత్ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కానీకొచ్చింది.

  తాజాగా  మూవీని నుంచి మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అంతేకాదు ఈ మూవీని వచ్చే యేడాది జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టు ఈ మోషన్ పోస్టర్‌లో అఫీషియల్‌గా ప్రకటించారు. హీరోగా అజిత్‌కు ఇది 58వ మూవీ. ‘వాలి’ తర్వాత అజిత్ ఈ మూవీలోనే డ్యూయల్ రోల్లో యాక్ట్ చేస్తున్నాడు.

  ఈ మూవీలో అజిత్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నాడు. ఇమామ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌ తెరకెక్కిస్తోంది. ఈ మూవీ తర్వాతా అజిత్ హిందీలో అమితాబ్, తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ మూవీ రీమేక్‌లో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Ajith, Kollywood

  ఉత్తమ కథలు