Home /News /movies /

AJITH VIJAY HEROES FANS STARTS TWITTER WAR TA

అజిత్ పుట్టిరోజున సోషల్ మీడియాలో విజయ్ ఫ్యాన్స్ రచ్చ..

విజయ్, అజిత్ ఫైల్ ఫోటోస్

విజయ్, అజిత్ ఫైల్ ఫోటోస్

అభిమానం అనేది ఎలా ఉండాలంటే తమ అభిమాన హీరో సినిమా వస్తే చూడటం.. ఒకవేళ నచ్చితే రెండోసారో.. మూడోసారి చూడటం వెరీ కామన్. తాజాగా అజిత్ పుట్టినరోజు సందర్భంగా విజయ్ ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా మరో రచ్చ మొదలుపుట్టారు.

    అభిమానం అనేది ఎలా ఉండాలంటే తమ అభిమాన హీరో సినిమా వస్తే చూడటం.. ఒకవేళ నచ్చితే రెండోసారో.. మూడోసారి చూడటం వెరీ కామన్. అభిమానం అలా ఉన్నపుడే అందం.. ఆనందం. ఇంత బిజీ లైఫ్‌లో కూడా ఇప్పటికీ హీరోల కోసం కొట్టుకోవడం.. అభిమానం పేరుతో చంపుకోవడం అనేది చాలా కామెడీగా ఉంటుంది. మిగిలిన ఇండస్ట్రీలలో ఏమో కానీ తమిళనాట మాత్రం ఇలాంటి స్టార్ వార్స్ చాలానే జరుగుతుంటాయి. ఈ  రోజు తమిళనాడు స్టార్ హీరో అజిత్ పుట్టినరోజు కావడంతో ఆయన ఫ్యాన్స్ HBDAjith అనే హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఐతే.. అజిత్ బర్త్ డే సందర్భంగా విజయ్ ఫ్యాన్స్ పోటాపోటీగా ‘ది ఫేస్ ఆఫ్ కోలీవుడ్ అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య ట్విట్టర్ వార్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వీళ్లిద్దరు కలిసి గతంలో ఓ సినిమాలో కలిసి ‘రాజావిన్ పార్వాయిలే’ సినిమాలో నటించారు. ప్రస్తుతం విజయ్. మాస్టర్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఒకవేళ లాక్‌డౌన్ లేకపోయింటే ఈ పాటికి విడుదలై ఉండేది. మరోవైపు అజిత్ హీరోగా వాలిమై సినిమా చేస్తున్నాడు. మొత్తానికి హీరోలందురు ఎంతో కలివిడిగా ఉంటారు. కానీ అభిమానులు మాత్రం తమ హీరోలపై ఉన్న అభిమానాన్ని ఇతర హీరోలపై దుమ్మెత్తి పోయడానికి వాడుకుంటున్నారు. మొత్తానికి ప్రపంచం మొత్తం మారుతున్న ఈ దురభిమానులు మాత్రం  మారడం లేదు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Ajith, Kollywood, Tamil Cinema, Vijay

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు