AJITH SENSATIONAL BLOCKBUSTER BILLA MOVIE GOING TO BE RE RELEASE IN MARCH 12TH PK
Ajith Billa: అజిత్ ‘బిల్లా’ రీ రిలీజ్.. 14 ఏళ్ళ తర్వాత మరోసారి విడుదల..
అజిత్ బిల్లా (Ajith Billa)
Ajith Billa: రీ రిలీజ్ అనే మాట ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు రిలీజ్ అయిన సినిమానే రెండు మూడు రోజుల్లో ఆన్లైన్లో పెట్టేస్తున్నారు. నెల రోజులు ఆగితే ఓటిటిలో పెట్టేస్తున్నారు.
రీ రిలీజ్ అనే మాట ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు రిలీజ్ అయిన సినిమానే రెండు మూడు రోజుల్లో ఆన్లైన్లో పెట్టేస్తున్నారు. నెల రోజులు ఆగితే ఓటిటిలో పెట్టేస్తున్నారు. దాంతో రీ రిలీజ్ అనే మాటే పూర్తిగా మరిచిపోయారు. ఇలాంటి సమయంలో ఓ సినిమాను ఇప్పుడు దాదాపు 13 ఏళ్ళ తర్వాత ఈ సినిమాను మరోసారి విడుదల చేయాలని నిర్మాతలు ఫిక్సయ్యారు. 2007లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. అప్పట్లో రికార్డులు తిరగరాసాడు బిల్లా. తమిళనాట ఈ సినిమా ఊపు ఊపేసింది. ఆ తర్వాత తెలుగులో ప్రభాస్ ఈ సినిమాను రీమేక్ చేసాడు. ఇక్కడ బిల్లా జస్ట్ యావరేజ్ అనిపించుకుంది. ఇదిలా ఉంటే ఆ బిల్లా సినిమాను ఇప్పుడు మరోసారి విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. అందులో నయనతార, నమిత హీరోయిన్లుగా నటించారు. విష్ణువర్దన్ దర్శకుడు. అజిత్ మాస్ ఇమేజ్‌కు తోడు.. నయనతార బికినీ అందాలు.. నమిత గ్లామర్ షో అవన్నీ సినిమాను బ్లాక్‌బస్టర్ చేసాయి. మార్చ్ 12న ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. కోవిడ్ కారణంగా కొత్త సినిమాలు ఇప్పటికీ విడుదల చేయడానికి నిర్మాతలు ఆలోచిస్తున్నారు.
అందుకే పాత సినిమాలు విడుదల చేసి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు నిర్మాతలు. బిల్లా రీ రిలీజ్ విషయాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అజిత్ అభిమానులు.