హోమ్ /వార్తలు /సినిమా /

Ajith - Tegimpu Movie Review: అజిత్ ‘తెగింపు’ మూవీ రివ్యూ.. కమర్షియల్ విత్ మెసెజ్ ఓరియంటెడ్..

Ajith - Tegimpu Movie Review: అజిత్ ‘తెగింపు’ మూవీ రివ్యూ.. కమర్షియల్ విత్ మెసెజ్ ఓరియంటెడ్..

అజిత్ ‘తెగింపు’ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్  (Twitter/Photo)

అజిత్ ‘తెగింపు’ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ (Twitter/Photo)

Ajith - Tegimpu Movie Review: తమిళ సూపర్ స్టార్ అజిత్‌ కుమార్ (Ajith Kumar) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు. మాస్ హీరోగా అభిమానులు అలరించే సినిమాలు చేస్తూ బీభత్సమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.  ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ సినిమా తునివు. తెలుగులో ‘తెగింపు’ టైటిల్‌తో విడుదలైంది. ఈ రోజు విడుదలైన ఈ సినిమాతో అజిత్ మరో సక్సెస్ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రివ్యూ : తెగింపు (Tegimpu)

నటీనటులు : అజిత్ కుమార్, మంజు వారియర్, సముద్రఖని,ప్రవీణ్ రెడ్డి, అజయ్  తదితరులు..

ఎడిటర్: విజయ్ వేలుకుట్టి

సినిమాటోగ్రఫీ: నిరవ్ షా

సంగీతం: జిబ్రాన్

నిర్మాత : బోనీ కపూర్

దర్శకత్వం: H.వినోత్

విడుదల తేది : 11/1/2023

తమిళ సూపర్ స్టార్ అజిత్‌ కుమార్ (Ajith Kumar) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు. మాస్ హీరోగా అభిమానులు అలరించే సినిమాలు చేస్తూ బీభత్సమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.  ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ సినిమా తునివు. తెలుగులో ‘తెగింపు’ టైటిల్‌తో విడుదలైంది. ఈ రోజు విడుదలైన ఈ సినిమాతో అజిత్ మరో సక్సెస్ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.

కథ విషయానికొస్తే..

విశాఖ పట్నం కేంద్రం పనిచేసే ఒక ప్రైవేటు బ్యాంక్‌లో రూ. 500 కోట్ల డబ్బును దోచుకోవడానికి ఒక ముఠా ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ముఠా బ్యాంక్‌లో ప్లాన్ ప్రకారం ప్రవేశిస్తున్నారు. ఇక అదే బ్యాంక్‌లో డార్క్ డెవిల్ అలియాస్ మైఖేల్ (అజిత్ కుమార్) ఉంటాడు.అతను కూడా బ్యాంక్ రాబరీ కోసమే వచ్చాడనే విషయం తెలుస్తోంది. అసలు డార్క్ డెవిల్ బ్యాంక్ దోచుకోవడానికి ఎందుకు వచ్చాడు. అతని అసలు లక్ష్యం ఏమిటి ? అనేదే తెగింపు మూవీ స్టోరీ.

కథనం, టెక్నీషయిన్స్ విషయానికొస్తే..

దర్శకుడు హెచ్. వినోత్ కూడా ఒక చిన్న పాయింట్‌‌ చుట్టు ఒక బ్యాంక్ నేపథ్యంలో ‘తెగింపు’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా పాయింట్ ఒకింత మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ గుర్తుకు వస్తుంది. ముఖ్యంగా ప్రైవేటు బ్యాంకులు తమ ఎంప్లాయిస్‌‌కు టార్గెట్ ఫిక్స్ చేయడం. వాళ్ల ఉద్యోగం కోసం  ప్రజలకు అవసరం లేకున్న ఫోన్లు చేసి  వారికి క్రెడిట్ కార్డులు, మ్యూచవల్ ఫండ్స్, ఇన్యూరెన్స్‌లు అంటగట్టడం. అటు బ్యాంకు పెద్దలు .. అందులో డిపాజిట్ చేసిన డబ్బున్న వాళ్ల లిస్టు ఉద్యోగులకు ఇచ్చి ప్రజలకు అవసరం లేకున్నా వాళ్లకు లోన్ అంటగట్టేలా చేయడం. మరోవైపు మ్యూచ్‌వల్ ఫండ్స్ అంటూ ప్రజలను అందులో పెట్టుబడులు పెట్టేలా చేయడం వంటివి ప్రస్తుతం బ్యాంక్ నేపథ్యంలో జరుగుతున్న తతంగాన్ని మొత్తం బయటపెట్టాడు. అప్పట్లో కృషి బ్యాంక్, చార్మినార్ బ్యాంక్, ప్రుడెన్షియల్ బ్యాంక్ ప్రజల నుంచి డిపాజిట్స్ సేకరించి చేతులెేత్తయడం వంటివి ఈ సినిమాలో దర్శకుడు వినోత్ చక్కగా ప్రెజెంట్ చేయగలిగాడు. ప్రస్తుతం సమాజంలో బ్యాంక్ నేపథ్యంలో జరుగుతున్న అక్రమాలు, వాళ్లు ప్రజలను చేస్తోన్న నిలువు దోపిడిని ఈ సినిమాలో బాగానే ఎండగట్టాడు. ముఖ్యంగా తాను అనుకున్న కథను తెరపై చక్కగా ప్రెజెంట్ చేయగలిగాడు. మాములు కమర్షియల్ కథకు మెసేజ్ ఓరియంటెడ్‌గా తెరపై ఆవిష్కరించాడు.

ఇక దర్శకుడు హీరో అజిత్ క్యారెక్టర్‌ను కూడా బాగానే చూపించాడు. అభిమానులకు కనెక్ట్ అవుతోంది..  కానీ కామన్ ఆడియన్స్‌కు  అంతగా కనెక్ట్ కాదు. సినిమా మొత్తాన్ని ఒక రోజులో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించాడు. మధ్యలో హీరో ష్లాష్ బ్యాక్ ఉంటుంది. హీరో ఎలివేషన్స్, యాక్షన్స్ సీన్స్‌తోనే సినిమా మొత్తం నడిపించాడు.  ఒక అంతర్జాతీయ గ్యాంగ్ స్టర్.. ఒక సంఘటన నేపథ్యంలో మారి.. ప్రజల బాగు కోసం ఆలోచించడం అనేది లాజిక్‌కు అంతగా  అందదు. ముఖ్యంగా క్రైమ్ రిపోర్టర్స్‌కు పోలీసులకు మధ్య ఉన్న సంబంధాన్ని ఈ సినిమా  బాగానే చూపించాడు.  ముఖ్యంగా క్లైమాక్స్‌లో హీరో.. భారత నేవి, ఆర్మీని ఛాలెంజ్‌ను చేసే సన్నివేశాలు మన త్రివిధ దళాలను అవమాన పరిచేవిధంగా ఉన్నాయి. ఓవరాల్‌గా లాజిక్ అందని ఓ మాస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమాలో డైెరెక్టర్ తర్వాత చెప్పుకోవాల్సింది కెమెరా పనితనం. నిరవ్ షా ఈ సినిమా ఫోటోగ్రఫీ అదిరిపోయింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో బోట్, మరియు హెలికాప్టర్ ఛేజింగ్ సన్నివేశాలను తన కెమెరాలో అద్భుతంగా బంధించాడు. ఈ సినిమాకు జిబ్రాన్ అందించిన సంగీతం పెద్ద ఎస్పెట్. రీ రికార్డింగ్  ీఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఎడిటర్ ఉన్నంతలో పర్వాలేదనిపించాడు. ఈ యాక్షన్ స్టోరీలో పాటలకు పెద్దగా స్కోప్ లేకపోవడం ప్రేక్షకులకు పెద్ద రిలీఫ్.

నటీనటుల విషయానికొస్తే..

అజిత్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. గ్యాంగ్ స్టర్ డార్క్ డెవిల్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. సినిమా మొత్తం వన్ మ్యాన్ షోగా నడిపించాడు. సినిమా మొత్తం దాదాపు ఒకటే కాస్ట్యూమ్‌తో ఉండటం.. తనదైన మ్యానరిజంతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌గా నటించిన మంజు వారియర్ తన పాత్రకు న్యాయం చేసింది. కమిషనర్ పాత్రలో నటించిన సముద్రఖని, విలనిజం నిండిన పోలీస్ ఆఫీసర్‌గా అజయ్ బాగానే నటించారు. ఇక ఈ సినిమాలో మరో ఆఫీసర్‌గా, జర్నలిస్టుగా నటించిన నటులు తన పరిధి మేరకు బాగానే నటించారు.

ప్లస్ పాయింట్స్

అజిత్ నటన, స్క్రీన్ ప్రెజెన్స్

యాక్షన్ సన్నివేశాలు

ఫోటోగ్రఫీ

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్ 

రొటీన్ కథ

సెకండాఫ్

లాజిక్ లేని సన్నివేశాలు

చివరి మాట : తెగింపు.. కమర్షియల్ విత్ మెసెజ్ ఓరియంటెడ్..

First published:

Tags: Ajith, Kollywood, Tegimpu, Thunivu, Tollywood

ఉత్తమ కథలు