తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar) గురించి ప్రత్యేకంగా పరిచయ చేయాల్సిన అక్కర లేదు. మాస్ హీరోగా అభిమానులు అలరించే సినిమాలు చేస్తూ బీభత్సమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక్కడ విశేషమేమంటే అజిత్ కుమార్ ఇక్కడ సికింద్రాబాద్‌లోనే జన్మించారు. దీంతో తనకు వీలు దొరికినప్పుడల్లా హైదరాబాద్‌కు వచ్చి వెళ్తుంటాడు అజీత్. ఇక తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన పెద్దగా పేరు రాలేదు. కానీ అక్కడ తమిళ నాడులో సూపర్ పాపులర్ అయ్యారు అజిత్. తమిళ్‌లో అజిత్ ఎన్ వీడు ఎవ్ కనావర్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత కాదల్ కొట్టై, కాదల్ వారువాల,కాదల్ మన్నన్ వంటిసినిమాల్లో నటించి చాలా పాపులర్ అయ్యారు. కెరీర్ తొలినాళ్లలో అజిత్ ఎన్నో ప్రేమకథా చిత్రాలతో నటించారు. ఆయన నటించిన ప్రేమలేఖ తెలుగులోకి డబ్ అయ్యి.. చాలా పెద్ద హిట్ అయింది. ఇక యస్ జే సూర్య దర్శకత్వంలో 1999లో వచ్చిన వాలితో మరింత పాపులర్ అయ్యారు. ఇక ఆయన తాజా సినిమా వాలిమై.. (Valimai) ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.
తమిళ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అజిత్(Ajith) వాలిమై (Valimai) ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌ను పూర్తిగా యాక్షన్ సన్నివేశాలతో నింపారు. విజువల్స్ బాగున్నాయి. తెలుగు హీరో కార్తికేయ కూడా తన లుక్‌తో అదరగొట్టారు. ఇక అజిత్ లుక్ కేకపెట్టించే విధంగా ఉంది. అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్నో అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా ఇటు తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషాల్లో కూడా విడుదల కానుంది.
ఇది అజిత్ కుమార్ మొదటి ప్యాన్ ఇండియా సినిమా అంటున్నారు. తెలుగులో ఈ సినిమాను బలం పేరుతో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ఇక వాలిమై (Valimai) ట్రైలర్‌ను చూస్తుంటే అంచనాల్ని అందుకునేలా ఉన్నట్లు తెలుస్తోంది. అజిత్ డ్రైవ్ చేసిన బైకులు, యాక్షన్ స్టంట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. బేవ్యూ ప్రాజెక్ట్స్ పతాకంపై బోనీకపూర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వాలిమై (Valimai) చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో అజిత్‌కు జోడీగా హిందీ భామ హ్యుమా ఖురేషి నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ భాషాల్లో 2022 సంక్రాంతి కానుకగా విడుదలకానుంది.
Plug in your headphones and enjoy the most-awaited #ValimaiTrailer out now! 🔥
➡️ https://t.co/ooeXxGFB79#AjithKumar #HVinoth @BoneyKapoor @BayViewProjOffl @thisisysr @ZeeStudios_ @SureshChandraa @sonymusicsouth#ValimaiPongal #Valimai pic.twitter.com/bUiWvb2zws
— BA Raju's Team (@baraju_SuperHit) December 30, 2021
Game mudiyala… adutha level-ku poga poguthu 😎🔥
(Headphones-oda ready-ah irrunga) 🎧#ValimaiTrailer : https://t.co/YWyViv7vjK#AjithKumar @BoneyKapoor #HVinoth @thisisysr @BayViewProjOffl @ZeeStudios_ @sureshchandraa #NiravShah @humasqureshi @editorvijay @dhilipaction pic.twitter.com/1eE9LMg2vC
— Kartikeya (@ActorKartikeya) December 30, 2021
ఇక అజిత్ పర్సనల్ విషయాల గురించి వస్తే.. ఆయన ప్రముఖ నటి షాలినిని 2000వ సంవత్సరంలో పెళ్ళి చేసుకున్నారు. అజిత్ బహుభాషాకోవిదుడు. ఆయన తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, ఇంగ్లీష్ భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. అందరి హీరోల్లా కాకుండా.. జుట్టు మొత్తం తెల్లబడినా.. ఏమాత్రం రంగు వేసుకోకుండా అలాగే హీరో పాత్రలు పోషిస్తున్నారు అజిత్. మూడుసార్లు ఫిల్ం ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డులు పొందిన అజిత్ గురించి చాలామందికి తెలియని మరో విషయం.. ఆయన దేశంలోనే అత్యుత్తమ డ్రైవర్లలో ఒకరు. అజిత్ ఫార్ములా 2 రేసింగ్‌లో డ్రైవర్గా కూడా పాల్గొన్నారు.
అంతేకాదు దేశంలో అత్యుత్తమ డ్రైవర్లలో అజిత్ కూడా ఒకరు అంటారు. అజిత్ నటుడుగా మారక ముందు బైకు మెకానిక్ గా తన జీవితాన్ని ఆరంభించారు. ఆ తర్వాత కొన్ని రోజులు గార్మెంట్స్ ఫ్యాక్టరీని నడిపారు. కొన్ని యాడ్స్‌లో కూడా నటించిన అజిత్ ఆ తర్వాత సినిమాల్లో అవకాశం వచ్చి పూర్తి స్థాయి నటుడిగా మారారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ajith, Hero kartikeya, Tollywood news