AJITH 62 MOVIE WITH VIGNESH SHIVAN AFTER VALIMAI SUCCESS LYCA PRODUCTION PRODECED MOVIE TA
AK 62 - Ajith : విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో అజిత్ 62వ చిత్రం.. అధికారిక ప్రకటన..
అజిత్ 62వ చిత్రంపై అధికారిక ప్రకటన (File/Photo)
AK 62 - Ajith - Valimai | తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు. మాస్ హీరోగా అభిమానులు అలరించే సినిమాలు చేస్తూ బీభత్సమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.
AK 62 - Ajith - Valimai | తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు. మాస్ హీరోగా అభిమానులు అలరించే సినిమాలు చేస్తూ బీభత్సమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.రీసెంట్గా ఈయన ‘వలీమై’ చిత్రంతో పలకరించారు. ఈ సినిమా తమిళం, తెలుగు, కన్నడ, హిందీలో ఏక కాలంలో విడుదల చేశారు. తమిళంలో మాత్రం సక్సెస్ అందుకున్న ఈ చిత్రం మిగిలిన భాషల్లో అంతగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. ఈ సినిమాలో తెలుగు నటుడు కార్తికేయ (Karthikeya) విలన్ పాత్రలో అదరగొట్టారు. బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషీ Huma Qureshi) ఈ సినిమాలో కథానాయికగా నటించింది. దారి దోపిడీలు చేసే ఓ గ్యాంగ్‌ను పట్టుకునే పోలీస్ అధికారి పాత్రలో అజిత్ కుమార్ నటించారు.
మొత్తంగా బైక్ ఛేజింగ్ సీనులు ఓ రేంజ్లో ఉన్నాయి. ఈ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రానుంది. ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. అజిత్‌తో ఆయనకు రెండో చిత్రమిది. తాజాగా అజిత్ తన 62వ చిత్రాన్ని ప్రకటించారు.
అజిత్ కుమార్ 62వ చిత్రం అధికారిక ప్రకటన (Twitter/Photo)
విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరణ్ నిర్మిస్తున్నారు. నిర్మాణ బాధ్యతలను GKM తమిళ కుమరన్ నిర్వహించనున్నారు. ఈ సినిమాను ఈ యేడాది చివర్లో మొదలై.. వచ్చే యేడాది మధ్యలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్టు ప్రకటించారు. ఇక అజిత్ వలీమై తర్వాత మరోసారి హెచ్. వినోద్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.
ఇక అజిత్ పర్సనల్ విషయాల గురించి వస్తే.. ఆయన ప్రముఖ నటి షాలినిని 2000వ సంవత్సరంలో పెళ్ళి చేసుకున్నారు. అజిత్ బహుభాషాకోవిదుడు. ఆయన తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, ఇంగ్లీష్ భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. అందరి హీరోల్లా కాకుండా.. జుట్టు మొత్తం తెల్లబడినా.. ఏమాత్రం రంగు వేసుకోకుండా అలాగే హీరో పాత్రలు పోషిస్తున్నారు అజిత్. మూడుసార్లు ఫిల్ం ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డులు పొందిన అజిత్ గురించి చాలామందికి తెలియని మరో విషయం.. ఆయన దేశంలోనే అత్యుత్తమ డ్రైవర్లలో ఒకరు. అజిత్ ఫార్ములా 2 రేసింగ్‌లో డ్రైవర్‌గా కూడా పాల్గొన్నారు. అంతేకాదు దేశంలో అత్యుత్తమ డ్రైవర్లలో అజిత్ కూడా ఒకరు అంటారు. అజిత్ నటుడుగా మారక ముందు బైకు మెకానిక్ గా తన జీవితాన్ని ఆరంభించారు. ఆ తర్వాత కొన్ని రోజులు గార్మెంట్స్ ఫ్యాక్టరీని నడిపారు. కొన్ని యాడ్స్‌లో కూడా నటించిన అజిత్ ఆ తర్వాత సినిమాల్లో అవకాశం వచ్చి పూర్తి స్థాయి నటుడిగా మారారు.
ఇక్కడ విశేషమేమంటే అజిత్ కుమార్ ఇక్కడ సికింద్రాబాద్‌లోనే జన్మించారు. దీంతో తనకు వీలు దొరికినప్పుడల్లా హైదరాబాద్‌కు వచ్చి వెళ్తుంటారు అజీత్. ఇక తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన పెద్దగా పేరు రాలేదు. కానీ అక్కడ తమిళ నాడులో సూపర్ పాపులర్ అయ్యారు అజిత్. తమిళ్లో అజిత్ ఎన్ వీడు ఎవ్ కనావర్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత కాదల్ కొట్టై, కాదల్ వారువాల,కాదల్ మన్నన్ వంటిసినిమాల్లో నటించి చాలా పాపులర్ అయ్యారు. కెరీర్ తొలినాళ్లలో అజిత్ ఎన్నో ప్రేమకథా చిత్రాలతో నటించారు. ఆయన నటించిన ప్రేమలేఖ తెలుగులోకి డబ్ అయ్యి.. చాలా పెద్ద హిట్ అయింది. ఇక యస్ జే సూర్య దర్శకత్వంలో 1999లో వచ్చిన వాలితో మరింత పాపులర్ అయ్యారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.