NerKonda Paarvai twitter review : నెర్కొండ పార్వాయి ట్వీటర్ రివ్యూ

NerKonda Paarvai twitter review : అజిత్  ప్రధాన పాత్రలో, జెర్సీ ఫేమ్ శ్రద్దా శ్రీనాథ్ మరో కీలక పాత్రలో నటించిన సినిమా 'నెర్కొండ  పార్వాయి'. ఈ సినిమా హిందీలో సూపర్ హిట్టైన 'పింక్' సినిమాకు రీమేక్... ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు.. నటీ నటుల ఫర్ఫామెన్స్‌పై నెటిజన్స్ స్పందన ఎలా ఉందో చూద్దాం..

news18-telugu
Updated: August 8, 2019, 12:31 PM IST
NerKonda Paarvai twitter review : నెర్కొండ పార్వాయి ట్వీటర్ రివ్యూ
నెర్కొండ పార్వాయి.. Photo : Twitter
news18-telugu
Updated: August 8, 2019, 12:31 PM IST
Ajith: అజిత్ కుమార్...  తమిళనాడులో రజినీకాంత్, కమల్ హాసన్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్. ఆయన ప్రధాన పాత్రలో 'నెర్కొండ  పార్వాయి' ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా హిందీలో అమితాబ్ నటించిన 'పింక్' సినిమాకు రీమేక్. ఈ సినిమాను తమిళ్‌లో బోని క‌పూర్‌ నిర్మించగా.. హెచ్ వినోథ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అజిత్‌తో పాటు జెర్సీ ఫేమ్ శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, ఆండ్రియా తరియంగ్‌, అభిరామి వెంక‌టచ‌లంలు ముఖ్య పాత్ర‌లు చేస్తున్నారు. అజిత్ నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. హిందీలో అమితాబ్ చేసిన లాయ‌ర్ పాత్ర‌లో అజిత్ అదరగొట్టనున్నాడు. 'నెర్కొండ  పార్వాయి' కథా విషయానికి వస్తే.. వ్యభిచార గృహాల్లో చిక్కుకున్న ముగ్గురు యువతులను రక్షించే న్యాయవాది కథతో త‌మిళ నేటివిటీకి దగ్గరగా కొన్ని మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు దర్శకుడు వినోథ్.

నెర్కొండ పార్వాయి.. Photo : Twitter


'నెర్కొండ పార్వాయి' చిత్రంలో అజిత్ భార్య‌గా హిందీ నటి విద్యా బాల‌న్ న‌టిస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. మరీ ఈ  సినిమాలో అజిత్ ఫర్ఫామెన్స్ ఎలా ఉందీ.. జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ తన నటనతో ఆకట్టుకుందా... అసలు సినిమా ప్రేక్షకుల్నీ అలరిస్తుందా.. నచ్చిన అంశాలు ఎంటో చూద్దాం...

Loading...














First published: August 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...