అజయ్ దేవ్‌గణ్ ‘తానాజీ’ ట్రైలర్ టాక్.. వెండితెరపై రియల్ బాహుబలి..

‘తానాజీ’ ట్రైలర్ టాక్ (Instagram/Photo)

గత కొన్నేళ్లుగా అన్ని ఇండస్ట్రీస్‌లో నిజ జీవిత గాథలపై సినిమాలు తెరకెక్కుతున్నాయి. తాజాగా అజయ్ దేవగణ్.. తానాజీ అనే చారిత్రక యోధుడి కథాంశంతో సినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమా ట్రైలర్ కాసేపటి క్రితమే విడుదలైంది.

  • Share this:
    గత కొన్నేళ్లుగా అన్ని ఇండస్ట్రీస్‌లో నిజ జీవిత గాథలపై సినిమాలు తెరకెక్కుతున్నాయి. తాజాగా హిందీలో అజయ్ దేవ్‌గణ్.. 1670లో మరాఠా సామ్రాజ్యధినేత ఛత్రపతి శివాజీ మహారాజ్.. దగ్గర సుబేదార్‌గా పనిచేసి శివాజీ ఎన్నో విజయాల్లో కీలక భూమిక పోషించిన  తానాజీ‌గా జీవిత చరిత్ర ఆధారంగా  ‘తానాజీ’  చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్ ఆధ్యంతం యుద్ధ సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా మొఘల్ సామ్రాజ్యాధినేత ఔరంగజేబుకు చెందిన కోటపై శివాజీ ఆజ్ఞతో సర్జికల్ స్ట్రైక్ చేసిన మొనగాడు తానాజీ. ఆ తర్వాత మరాఠ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలన్న ఔరంగజేబును ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర సుబేదార్‌గా పనిచేసిన తానాజీ ఏ రకంగా రాజ్యాన్ని సంరక్షించడానేదే ఈ సినిమా స్టోరీ.  ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ సరసన తన నిజ జీవిత భాగస్వామి కాజోల్ నటించడం విశేషం. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాలో జగపతిబాబు మరో ముఖ్యపాత్రలో నటించాడు. ఓమ్ రౌత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను టీ సిరీస్‌తో కలిసి అజయ్ దేవ్‌గణ్ నటిస్తున్నాడు. హీరోగా అజయ్‌ దేవ్‌గణ్‌కు ఇది వందో సినిమా కావడం విశేషం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: