బాక్సాఫీస్ దగ్గర ‘తానాజీ’ విశ్వరూపం... రూ.200 కోట్ల దిశగా అజయ్ దేవ్‌గణ్ సినిమా.

బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తానాజీ’. 17వ శతాబ్దంలో మరాఠా సామ్రాజ్యాన్ని ఏలిన ఛత్రపతి శివాజీ మహారాజ్.. దగ్గర సుబేదార్‌గా పనిచేసి ఆయన ఎన్నో విజయాల్లో కీలక భూమిక పోషించిన  తానాజీ‌ జీవిత చరిత్ర ఆధారంగా అదే  ‘తానాజీ’ టైటిల్‌తో దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 150 కోట్లను కొల్లగొట్టింది.

news18-telugu
Updated: January 19, 2020, 6:53 PM IST
బాక్సాఫీస్ దగ్గర ‘తానాజీ’ విశ్వరూపం... రూ.200 కోట్ల దిశగా అజయ్ దేవ్‌గణ్ సినిమా.
‘తానాజీ’ ట్రైలర్ టాక్ (Instagram/Photo)
  • Share this:
బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తానాజీ’. 17వ శతాబ్దంలో మరాఠా సామ్రాజ్యాన్ని ఏలిన ఛత్రపతి శివాజీ మహారాజ్.. దగ్గర సుబేదార్‌గా పనిచేసి ఆయన ఎన్నో విజయాల్లో కీలక భూమిక పోషించిన  తానాజీ‌ జీవిత చరిత్ర ఆధారంగా అదే  ‘తానాజీ’ టైటిల్‌తో దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించాడు. జనవరి 10న విడుదలైన ఈ సినమా బాక్సాఫీస్ దగ్గర స్టడీగా కలెక్షన్స్‌ను రాబడుతోంది. మొత్తంగా ఈ సినిమా 10 రోజుల్లో మొత్తంగా రూ. 150 కోట్ల వసూళ్లను రాబట్టి రూ. 200 కోట్ల దిశగా ప్రయాణిస్తోంది. పూర్తి యాక్షన్ నేపథ్యంలో  తెరకెక్కిన ఈ చిత్రానికి ఉత్తరాదిలో పలు రాష్ట్రాలు పన్ను మినహాయింపు ప్రకటించాయి. ముఖ్యంగా ఈ సినిమా యాక్షన్ ఘట్టాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తంగా నార్త్ సర్కిల్స్‌లో ఈ సినిమా తన సత్తా చూపెడుతూ దూసుకుపోతుంది. ఈ సినిమా సూపర్ హిట్టైయిన సందర్భంగా అజయ్ దేవ్‌గణ్ చిత్ర యూనిట్‌కు ముంబాయిలో పెద్ద పార్టీ ఇచ్చాడు.

ఈ సినిమాలో టైటిల్ పాత్రధారి తానాజీగా  అజయ్ దేవ్‌గణ్ నటించాడు. ఆయన భార్య సావిత్రిబాయి మలుసరే పాత్రలే అజయ్  నిజ జీవిత భాగస్వామి కాజోల్ నటించడం విశేషం. సైఫ్ అలీ ఖాన్ ఉదయ్ భాన్ అనే ఔరంగజేబుకు నమ్మిన బంటుగా నటించాడు. ఇక ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో విలన్‌గా నటించిన శరత్ కేల్కర్ ఈ చిత్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో నటించాడు. ఈ సినిమాలో జగపతిబాబు మరో ముఖ్యపాత్ర శెలార్ మామా పాత్రలో నటించాడు. ఓమ్ రౌత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను టీ సిరీస్‌తో కలిసి అజయ్ దేవ్‌గణ్ నిర్మించాడు. హీరోగా అజయ్‌ దేవ్‌గణ్‌కు ఇది వందో సినిమా కావడం విశేషం
First published: January 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు