AJAY DEVGN RRR FAME ACTION DRAMA KAITHI REMAKE BHOLAA FILM TO RELEASE ON 30 MARCH 2023 TA
Ajay Devgn - Bhola : ఆర్ఆర్ఆర్ హీరో అజయ్ దేవ్‌గణ్ ‘ఖైదీ’ రీమేక్ విడుదల తేది ఖరారు..
RRR హీరో అజయ్ దేవ్‌గణ్ ‘భోళా’ మూవీ విడుదల తేది (Twitter/Photo)
Ajay Devgn - Bhola : బాలీవుడ్ అగ్ర హీరోల్లో అజయ్ దేవ్‌గణ్ వరుస సినిమాలతో రఫ్పాడిస్తున్నారు. పాత్ర నచ్చితే క్యామియో రోల్స్ చేయడానికి వెనకాడని కథానాయికుల్లో అజయ్ దేవ్‌గణ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ యేడాది ఇప్పటికే రెండు చిత్రాలతో పలకరించినా ఈయన ఈ యేడాది మరో మూడు చిత్రాలతో పలకరించనున్నారు. తాజాగా ఈయన నటిస్తోన్న ఖైదీ రీమేక్ ‘భోళా’ విడుదల తేదిని అధికారికంగా ప్రకటించారు.
Ajay Devgn - Bhola : బాలీవుడ్లో హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోయే హీరోల్లో అజయ్ దేవ్‌గణ్ ఒకరు. ఈ యేడాది అజయ్ దేవ్‌గణ్ ఇప్పటికే ఆలియా భట్ ముఖ్యపాత్రలో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘గంగూబాయి కఠియావాడి’ సినిమాలో కరీమ్ లాలాగా అతిథి పాత్రలో మెరిసారు. మరోవైపు ఈయన ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ రౌద్రం రణం రుధిరం’ సినిమాలో రామ్ చరణ్ తండ్రిగా కథను మలుపు తిప్పే పాత్రలో నటించారు. ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ దగ్గర రూ. 1000 కోట్లకు పైగా వసూళు చేసి సంచలనం రేపింది. ఇప్పటికే కేజీఎఫ్ 2 విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లనే దక్కించుకుంటోంది. అంతేకాదు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ఇప్పటికే స్ట్రాంగ్‌గా ఉంది.
తాజాగా ఈయన హీరోగా తమిళంలో హిట్టైన ‘ఖైదీ’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్లో ఈ సినిమాను కమర్షియల్ హంగులతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ సరసన మరోసారి టబు హీరోయిన్గా నటిస్తోంది. చివరగా వీళ్లిద్దరు ‘దే దే ప్యార్ దే’ సినిమాలో నటించారు. ఇపుడు మరోసారి నటిస్తున్నారు. ఇక హిందీలో ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ధర్మేంద్ర శర్మ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల తేదిని అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమాను వచ్చే యేడాది 30 మార్చి 2023లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాపై బాలీవుడ్లో భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు ఈయన (అజయ్ దేవ్‌గణ్) నటిస్తూ, నిర్మిస్తూ.. దర్శకత్వం వహించిన చిత్రం ‘రన్ వే 34’. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) మరో కీలక పాత్రలో నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)కథానాయికగా నటించింది. ‘దే దే ప్యార్ దే’ సినిమా తర్వాత అజయ్ దేవ్‌గణ్, రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి కలిసి నటించారు. ఈ సినిమాకు ముందుగా మే డే (My Day )అనే టైటిల్‌తో చిత్రీకరించారు. ఆ తర్వాత ‘రన్‌వే 34’ టైటిల్ ఖరారు చేశారు. గతంలో ‘యూ మీ ఔర్ హమ్’ ‘శివాయ్’ వంటి ఒకటి రెండు చిత్రాలను డైరెక్ట్ చేశారు. తాజాగా ‘రన్‌వే 34’ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్నారు.
‘రన్‌వే 34’ మూవీని నిజ జీవిత ఘటనల ఆధారంగా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు.యాక్షన్ అండ్ అడ్వెంచర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈద్ కానుకగా ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గణ్ విమాన పైలెట్‌గా నటించారు. అతని కో పైలెట్‌గా రకుల్ ప్రీత్ సింగ్ యాక్ట్ చేసింది. హీరో నడిపే విమానం అనుకోని ప్రమాదానికి గురవుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందా.. లేకపోతే ఎవరి ప్రోద్బలంతోనైనా ఈ ప్రమాదానికి బాధ్యులా అనే యాంగిల్లో సాగుతోంది. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమాను అజయ్ దేవ్‌గణ్ తెరకెక్కించారు.
మరోవైపు ఈయన హీరోగా నటించిన ‘మైదాన్’ సినిమా జూన్ 3 విడుదల చేస్తున్నారు.ఈ సినిమాను ప్రముఖ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. అమిత్ రవీంద్రనాథ్ శర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించారు. మరోవైపు ఈయన రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ‘సర్కస్’ లో కేమియో రోల్లో కనిపించనున్నారు. ఈ సినిమా జూలై 15న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంకోవైపు అజయ్ దేవ్‌గణ్.. ఇంద్ర కుమార్ దర్శకత్వంలో ‘థాంక్స్ గాడ్’ చిత్రంతో పాటు ‘దృశ్యం 2’తో చాణక్య సినిమాలకు ఓకే చెప్పారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.