Ajay Devgn: - Rohit Shetty | బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు మస్తు గిరాకీ వుంటుంది. అటువంటి హీరో, డైరెక్టర్ కాంబినేషన్ అజయ్ దేవ్‌గణ్, దర్శకుడు రోహిత్ శెట్టిది. బాలీవుడ్ల అజయ్ దేవ్‌గణ్‌కు డైరెక్టర్ రోహిత్ శెట్టి కాంబినేషన్ కు మంచి క్రేజ్ వుంది. ఈళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన చాలా సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఇక డైరెక్టర్ గా రోహిత్ శెట్టి ఫస్ట్ మూవీ జమీన్. ఈ మూవీలో హీరోగా నటించింది అజయ్ దేవగనే. ఈ మూవీలో అజయ్‌తో పాటు అభిషేక్ బచ్చన్ ఈ మూవీలో సెకండ్ హీరోగా యాక్ట్ చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. ఆ తర్వాత ఈళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘గోల్ మాల్’...బాలీవుడ్ బాక్సాఫీస్ ను బద్దలు కొట్టింది. ఆ తర్వాత ఈ సిరీస్ ల వచ్చిన గోల్ మాల్ రిటర్స్స్, గోల్ మాల్ 3లు కూడా జబర్థస్త్ హిట్ సాధించాయి.
ఇపుడు మళ్లీ ఈళ్లిద్దరు కల్షి ఈ సిరీస్ ల ‘గోల్ మాల్ ఎగైన్’ అంటూ నాల్గో సీక్వెల్ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించి బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే సాధించింది. ఒక్క గోల్మాల్ సిరీస్‌లోనే కాదు...సింగం సిరీస్‌లో కూడా అజయ్, రోహిత్ శెట్టిలు కలిసి బాలీవుడ్ బాక్సాఫీస్‌ను గర్జించేటట్టు చేశారు. అంతేకాదు గోల్ మాల్ సిరీస్ ల నాల్గో సీక్వెల్ తర్వాత సింగం సిరీస్‌లో మూడో సిరీస్‌కు ఓకే చెప్పారు. ఈ సినిమాకు ‘సింగం ఎగైన్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
#Xclusiv… AJAY DEVGN - ROHIT SHETTY REUNITE FOR ‘SINGHAM AGAIN’… BIGGG NEWS… One of the most successful combinations ever - #AjayDevgn and director #RohitShetty - collaborate once again… For #SinghamAgain [yes, that’s the title]… Will start once #Ajay is free from #Bholaa. pic.twitter.com/K1z2PrS2um
— taran adarsh (@taran_adarsh) December 1, 2022
ఇక వీళ్లిద్దరి కాంబినేషన్లో గోల్ మాల్, సింగం సిరీసే కాకుండా...ఆల్ ది బెస్ట్, సండే, బోల్ బచ్చన్ సినిమాలు కూడా వచ్చినయి. ఇందుల ఆల్ ది బెస్ట్, సండే సిన్మాలు మాత్రం అనుకున్నంత రేంజ్లో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయలేకపోయాయి. బోల్ బచ్చన్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఓకే అనిపించింది. అటు రణ్వీర్ సింగ్.. ‘సింబా’తో పాటు అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘సూర్యవంశీ’లో కూడా అజయ్ దేవ్‌గణ్ అతిథి పాత్రల్లో మెరిసాడు. ఇపుడు రణ్వీర్ సింగ్‌తో చేస్తోన్న ‘సర్కస్‌లో కూడా అజయ్ దేవ్‌గణ్ ముఖ్యపాత్రలో మెరవనున్నాడు. మొత్తానికి ఈ మధ్యాకాలంలో ఒక హీరో, డైరెక్టర్ కాంబినేషన్లో రెండు, మూడు సినిమాలకు కలిసి పనిచేయుడు ఎక్కువ అనుకుంటే...వీళ్లు మాత్రం 12 సినిమాలు చేసారు. త్వరలో13వ చిత్రం రాబోతుంది. 14వ చిత్రం అధికారికంగా ప్రకటించారు. ఏది ఏమైనా అజయ్ దేవ్‌గణ్‌తో దర్శకుడు రోహిత్ శెట్టిది సూపర్ హిట్ కాంబినేషన్ అని చెప్పాలి.
ఇక అజయ్ దేవ్‌గణ్ ఈ యేడాది బాలీవుడ్లో ‘గంగూబాయ్ కఠియావాడి, ఆర్ఆర్ఆర్, వంటి సక్సెస్‌ల తర్వాత తాజాగా దృశ్యం 2 సక్సెస్‌తో అజయ్ దేవ్‌గణ్ 2022లో మూడో విజయం అందుకున్నారు. గంగూబాయ్, ఆర్ఆర్ఆర్లో ఈయన అతిథి పాత్రల్లో మెరిసారు. హీరోగా మాత్రం దృశ్యం 2 సక్సెస్‌ను అందుకున్నారు. ఈ యేడాది అజయ్ దేవ్‌గణ్ నటించిన ‘రన్‌వే 34’, థాంక్స్ గాడ్’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచాయి. మొత్తంగా ఐదు చిత్రాల్లో మూడు చిత్రాలు సక్సెస్ కావడం హీరోగా అజయ్ దేవ్‌గణ్ కలిసొచ్చే విషయం అనే చెప్పాలి. ఈయన నటించిన ‘దృశ్యం 2’ మూవీ రూ. 160 కోట్లు రాబట్టి రూ. 200 కోట్ల దిశగా దూసుకుపోతుంది. మరోవైపు అజయ్ దేవ్‌గణ్ తమిళ ఖైదీ రీమేక్ ‘భోళా’ మూవీని రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రోహిత్ శెట్టితో‘సింగం ఎగైన్’ మూవీ పట్టాలెక్కనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ajay Devgn, Bollywood news, Drishyam 2, Rohit Shetty