నా భార్యకు కరోనా లేదు.. క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో..

Ajay Devgan: బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ భార్య కాజోల్‌కు కరోనా వైరస్ సోకిందని కొన్ని వార్తలు పుట్టుకొచ్చాయి. 24 గంటలుగా ఈ వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 1, 2020, 9:25 PM IST
నా భార్యకు కరోనా లేదు.. క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో..
భర్త అజయ్ దేవ్‌గన్‌తో కాజోల్ (kajol and ajay devgan)
  • Share this:
కరోనా వైరస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ధారాళంగా వ్యాపిస్తుంది. ఒకర్నుంచి మరొకరికి చాలా వేగంగా వ్యాపించే ఈ మహమ్మారి నుంచి దూరంగా ఉండాలని.. చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే చాలా మంది చెబుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ఇంట్లోనే ఉండి కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ భార్య కాజోల్‌కు కరోనా వైరస్ సోకిందని కొన్ని వార్తలు పుట్టుకొచ్చాయి. 24 గంటలుగా ఈ వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

భర్త అజయ్ దేవ్‌గన్‌తో కాజోల్ (kajol and ajay devgan)
భర్త అజయ్ దేవ్‌గన్‌తో కాజోల్ (kajol and ajay devgan)


కాజోల్‌తో పాటు ఆయన కూతురుకు కూడా ఈ వైరస్ సోకిందనే ప్రచారం జరుగుతున్న వేళ.. అజయ్ బయటికి వచ్చి క్లారిటి ఇచ్చాడు. 24 గంటల నుంచి ఈ టార్చర్ అనుభవించిన అజయ్ బయటికొచ్చి అసలు నిజం చెప్పేసాడు. తన భార్యకు, కూతురుకు కరోనా సోకలేదని.. ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించి లేనిపోని కంగారు పుట్టించొద్దని కోరుతున్నాడు ఈయన. సోషల్ మీడియాలో వస్తున్నట్లు కాజోల్‌కు ఏం కాలేదని.. ఆమె చాలా ఆరోగ్యంగా ఉందని చెప్పాడు ఈయన.

కాజోల్ (kajol and ajay devgan)
కాజోల్ (kajol and ajay devgan)


సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత తను సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిందని క్లారిటీ ఇచ్చేసాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం RRR సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నేరుగా పరిచయం అవుతున్నాడు అజయ్ దేవ్‌గన్. ఈయన లాంటి సూపర్ స్టార్‌ను తను ఇప్పటి వరకు చూడలేదంటూ మొన్నీమధ్యే రాజమౌళి కితాబిచ్చాడు. అజయ్ లాంటి హీరో తమకు దొరకడం నిజంగానే మా అదృష్టం అని చెప్పాడు రాజమౌళి.
First published: April 1, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading