‘తానాజీ’ నుంచి మరో ట్రైలర్ విడుదల .. ఆర్ఆర్ఆర్ నటుడి విశ్వరూపం..

అజయ్ దేవ్‌గణ్ ‘ఆర్ఆర్ఆర్’ తానాజీ ట్రైలర్ టాక్ (Twitter/Photo)

గత కొన్నేళ్లుగా అన్ని ఇండస్ట్రీస్‌లో నిజ జీవిత గాథలపై సినిమాలు తెరకెక్కుతున్నాయి. తాజాగా అజయ్ దేవగణ్.. తానాజీ అనే చారిత్రక యోధుడి కథాంశంతో సినిమాను తెరకెక్కించాడు.తాజాగా ఈ చిత్రం నుండి మరో ట్రైలర్‌ను విడుదల చేసారు.

  • Share this:
    గత కొన్నేళ్లుగా అన్ని ఇండస్ట్రీస్‌లో నిజ జీవిత గాథలపై సినిమాలు తెరకెక్కుతున్నాయి. తాజాగా హిందీలో అజయ్ దేవ్‌గణ్.. 1670లో మరాఠా సామ్రాజ్యధినేత ఛత్రపతి శివాజీ మహారాజ్.. దగ్గర సుబేదార్‌గా పనిచేసి శివాజీ ఎన్నో విజయాల్లో కీలక భూమిక పోషించిన  తానాజీ‌గా జీవిత చరిత్ర ఆధారంగా  ‘తానాజీ’  చిత్రాన్ని దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ పోస్టర్స్‌, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో ట్రైలర్‌ విడుదల చేసారు. ముఖ్యంగా అప్పటి ఢిల్లీ బాద్‌షా ఔరంగజేబుపై శివాజీ సైనికులు చేసిన మెరుపు దాడుల నేపథ్యంలో  ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ముఖ్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర సుబేదార్‌గా పనిచేసి.. ఆయనకు ఎన్నో విజయాల్లో కీలక భూమిక వహించిన ‘తానాజీ’ జీవిత కథను సినిమాగా తెరెక్కించాడు.

    ఈ సినిమాలో టైటిల్ పాత్రధారి తానాజీగా  అజయ్ దేవ్‌గణ్ నటించాడు. ఆయన భార్య సావిత్రిబాయి మలుసరే పాత్రలే అజయ్  నిజ జీవిత భాగస్వామి కాజోల్ నటించడం విశేషం. సైఫ్ అలీ ఖాన్ ఉదయ్ భాన్ అనే ఔరంగజేబుకు నమ్మిన బంటుగా నటించాడు. ఇక ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో విలన్‌గా నటించిన శరత్ కేల్కర్ ఈ చిత్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో నటించాడు.  ఈ సినిమాలో జగపతిబాబు మరో ముఖ్యపాత్ర శెలార్ మామా పాత్రలో నటించాడు. ఓమ్ రౌత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను టీ సిరీస్‌తో కలిసి అజయ్ దేవ్‌గణ్ నిర్మించాడు. హీరోగా అజయ్‌ దేవ్‌గణ్‌కు ఇది వందో సినిమా కావడం విశేషం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: