నాలాంటోళ్లు రాజకీయాలకు పనికిరారు.. అజయ్ దేవ్‌గణ్ సంచలన వ్యాఖ్యలు..

అవును నాలాంటి వాళ్లు రాజకీయాలకు పనికిరారు. ఈ వ్యాఖ్యలు అన్నది ఎవరో కాదు బాలీవుడ్ టాప్ స్టార్ అజయ్ దేవ్‌గణ్. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: May 15, 2019, 8:13 AM IST
నాలాంటోళ్లు రాజకీయాలకు పనికిరారు.. అజయ్ దేవ్‌గణ్ సంచలన వ్యాఖ్యలు..
అజయ్ దేవ్‌గణ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
అవును నాలాంటి వాళ్లు రాజకీయాలకు పనికిరారు. ఈ వ్యాఖ్యలు అన్నది ఎవరో కాదు బాలీవుడ్ టాప్ స్టార్ అజయ్ దేవ్‌గణ్. వివరాల్లోకి వెళితే.. ఎంతో మంది నటీనటులు రాజకీయాల్లో ప్రవేశించి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా ఈ సారి ఎన్నికల్లో చాలా మది సినీ ప్రముఖులు రాజకీయాల్లో ప్రవేశించారు. ఈ ఎన్నికల్లో బాలీవుడ్ నటీనటుల్లో సన్ని డియోల్, ఊర్మిళ రాజకీయాల్లో అడుగుపెట్టారు. అంతేకాదు ఎంపీగా తమ లక్‌ను పరీక్షించుకుంటున్నారు. వీరి బాటలోనే అజయ్ దేవ్‌గణ్ కూడా రాజకీయాల్లో ప్రవేశించబోతున్నారా అని మీడియా వర్గాలు అతన్ని ప్రశ్నించాయి. దానికి అజయ్ దేవ్‌గణ్.. నాకు సిగ్గెక్కువ. రాజకీయాలు నా ఒంటికి సరిపడవు. ఎందుకంటే ఓ నేత ఎక్కడుంటే అక్కడ ప్రజలుంటారు. ఐతే కెమెరా ముందు నాకు అలాంటి భయం లేదు. కానీ పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇస్తే మాత్రం నా ఉద్యోగానికి న్యాయం చేయలేనన్నారు. రాజకీయాలనేది ప్రజల వృత్తి. ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటారో వాళ్లు ప్రజల్లో కలిసిపోవాలి. నాలా సిగ్గుపడుతూ కూర్చుంటే మంచి రాజకీయ నాయకుడు కాలేరన్నారు.

అవును నాలాంటి వాళ్లు రాజకీయాలకు పనికిరారు. ఈ వ్యాఖ్యలు అన్నది ఎవరో కాదు బాలీవుడ్ టాప్ స్టార్ అజయ్ దేవ్‌గణ్. వివరాల్లోకి వెళితే..
అజయ్ దేవ్‌గన్ రకుల్


ఇక రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన సన్ని డియోల్,ఊర్మిళకు నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నారంటే వారు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలతోనే రాజకీయాల్లోకి వచ్చరాని భావిస్తుంటా. ఈ యేడాది అజయ్ దేవ్‌గణ్ నటించిన ‘టోటల్ ధమాల్’ మంచి విజయాన్ని అందుకుంది. ఇపుడు టబు, రకుల్ ప్రీత్ సింగ్‌లతో కలిసి ‘దే దే ప్యార్ దే’ సినిమా  చేసాడు. ఈ శుక్రవారమే ఈ సినిమా ప్రేక్షకుల ముందు రానుంది.

First published: May 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు