Home /News /movies /

AJAY DEVGN HAS NOT SEEN THE RRR MOVIE SB

RRR:ఆర్ఆర్ఆర్ సినిమా చూడని అజయ్ దేవ్ గన్.. కారణం తెలిస్తే షాక్!

అజయ్ దేవ్ గన్

అజయ్ దేవ్ గన్

ఆర్ఆర్ఆర్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన అజయ్ దేవ్ గన్.. ఆ సినిమాను ఇంతవరకు చూడలేదు. దీంతో ఆయన స్వయంగా నటంచి.. అంత పెద్ద హిట్ అయిన సినిమా ఎందుకు చూడలేదని అభిమానులు చర్చించుకుంటున్నారు.

    బాలీవుడ్ ప్రముఖ హీరోల్లో అజయ్ దేవ్ గన్ ఒకరు. నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన స్టైల్లో సినిమాలు చేసుకుంటూ పోతుంటారు. హీరో పాత్రలు మాత్రమే కాకుండా సినిమాల్లో ఇతర ప్రధాన పాత్రలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. అయితే ఇటీవల అజయ్ తెలుగులో తొలిసారిగా ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో అజయ్ దేవగన్ ఒక కీలకమైన ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

    అయితే అజయ్ దేవగన్‌తో పాటు ఈ సినిమాలో ఆలియా భట్ కూడా నటించింది. అయితే ఆలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన గంగూబాయి కతియావాడి మూవీ లలో కూడా అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో నటించాడు. ఈ రెండు సినిమాలు హిట్ అయి మంచి టాక్ తెచ్చుకున్నాయి. అయితే ఈ రెండు సినిమాల్ని అజయ్ చూడలేదంటే మీరు నమ్ముతారు. అవును నిజం.. ఈ రెండు సినిమాలను కూడా ఇప్పటి వరకు అజయ్ దేవగన్ చూడలేదట. ఇంతకీ, అజయ్ దేవ్ గన్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు గంగూబాయి కతియావాడి సినిమా చేయకపోవడానికి కారణం లేకపోలేదు. దీనికి కారణాన్ని స్వయంగా నటుడు అజయ్ దేవ్ గన్ తెలిపాడు.

    తాను ఏదైనా కొత్త మూవీలో నటించాక కొద్దీ కాలానికి ఆ మూవీ ని చూసేస్తే సరేసరి, ఒకవేళ ఆ మూవీ ని చూడడం ఒకవేళ ఆలస్యం అయితే.. తాను ఇక ఆ సినిమాలను చూడనన్నాడు అజయ్ దేవ్ గన్. అయితే తాను ఇలా చేయడానికి ఓ రీజన్ ఉందన్నాడు. ఎందుకంటే, ఆయా సినిమాల్లో అప్పట్లో తాను అంతకన్నా బాగా నటించవలసి ఉండాల్సిందని ఆయనకు అనిపిస్తూ ఉంటుందన్నాడు అజయ్. అది కుదరదు కాబట్టి తాను నటించిన పాత సినిమా లోని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదు అని తాను అనుకుంటానని అజయ్ తెలిపాడు.

    మరోవైపు అజయ్ దేవ్ గన్‌కు కన్నడ స్టార్ హీరో సుదీప్‌కు మధ్య ట్విట్టర్ వార్ కొనసాగింది. సుదీప్ హిందీ భాషపై చేసిన కామెంట్లపై స్పందిస్తూ... హిందీ జాతీయ భాష కాకపోతే మీ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసి ఎందుకు విడుదల చేస్తున్నారు అని ప్రశ్నించాడు.హిందీ బాష ఇప్పటికీ, ఎప్పటికీ మన మాతృ భాషే, జాతీయ భాషే, జనగణమన అంటూ సమాధానమిచ్చాడు అజయ్‌ దేవగన్‌.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Ajay Devgn, Raja mouli, RRR

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు