ఎన్టీఆర్ పాత్రలో అజయ్ దేవ్‌గణ్.. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న మూవీ..

అజయ్ దేవ్‌గణ్,ఎన్టీఆర్ (Twitter/Photo)

కొన్నేళ్లుగా బాలీవుడ్ అండ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లో చారిత్రక నేపథ్యమున్న బయోపిక్‌లను తెరకెక్కించాడానికి మూవీ మేకర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. తాజాగా అజయ్ దేవ్‌గణ్..

 • Share this:
  కొన్నేళ్లుగా బాలీవుడ్ అండ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లో చారిత్రక నేపథ్యమున్న బయోపిక్‌లను తెరకెక్కించాడానికి మూవీ మేకర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఈ యేడాది బాలీవుడ్‌లో అజయ్ దేవ్‌గణ్.. ఛత్రపతి శివాజీ మహారాజు దగ్గర సుబేదార్‌గా పనిచేసిన ‘తానాజీ’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ‘తానాజీ’ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 300 కోట్లను వసూలు చేసి ఔరా అనిపించింది. తాజాగా అజయ్ దేవ్‌గణ్.. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ పోషించిన పాత్రను చేయడానికి రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ పాత్ర అంటే ఆయన పోషించిన చాణక్య చంద్రగుప్తుడి పాత్రను చేయడానికి రెడీ అవతున్నాడు.  భారత దేశ చరిత్రలో నంద వంశాన్ని నాశనం చేసి మౌర్య సామ్రాజ్య స్థాపన చేసిన చాణుక్యుడి జీవితంపై తెరకెక్కే ‘చాణక్య’ మూవీలో అజయ్ దేవ్‌గణ్ టైటిల్ పాత్రను పోషిస్తున్నాడు. దాంతో పాటు చంద్రగుప్తుడిగా ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు సమాచారం.

  ajay devgn kajol saif ali khan tanhaji movie second trailer released,ajay devgn,ajay devgn tanhaji,tanhaji trailer talk,tanhaji ajay devgn saif ali khan jagapati babu,balakrishna,ajay devgn,ajay devgan,nandamuri balakrishna, balakrishna gautamiputra satakarni,Tanhaji,gautamiputra satakarni,ajay devgn tanhaji,balakrishna 100th film gautamiputra satakarni,ajay devgn 100th film tanhaji,balakrishna twitter,balakrishna facedbook,balakrishna instagram,ajay devgn instagram,ajay devgn facebook,ajay devgn twitter,bollywood,tollywood,hindi cinema,telugu cinema,బాలకృష్ణ,అజయ్ దేవ్‌గణ్,బాలకృష్ణ అజయ్ దేవ్‌గణ్,బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి,అజయ్ దేవ్‌గణ్ తానాజీ,బాలకృష్ణ 100వ సినిమా,అజయ్ దేవ్‌గణ్ 100వ సినిమా,తానాజీ మూవీ రివ్యూ,అజయ్ దేవ్‌గణ్,తానాజీ ట్రైలర్ టాక్,జగపతి బాబు,అజయ్ దేవ్‌గణ్ తానాజీ
  అజయ్ దేవ్‌గణ్ ‘ఆర్ఆర్ఆర్’ తానాజీ ట్రైలర్ టాక్ (Twitter/Photo)


  చాణక్యుడి గురించి చెప్పాలంటే ఎవరైనా రాజకీయాల్లో బాగా రాణిస్తే.. అతన్ని అపర చాణక్యుడని పిలవడం పరిపాటిగా మారింది. భారత దేశ చరిత్రలోనే కాదు.. ప్రపంచ చరిత్రలో గొప్ప రాజనీతిజ్ఞుడిగా, అర్ధశాస్త్ర పితామహుడిగా పేరుతెచ్చుకున్న చాణక్యుడి పాత్రను అజయ్ దేవ్‌గణ్ పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ‘బేబి’ ‘స్పెషల్ ఛబ్బీష్’ వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన నీరజ్ పాండే డైరెక్ట్ చేయనున్నాడు.  ఈ మూవీ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, ఫ్రైడే ఫిల్మ్ వర్క్స్, ప్లాన్ సీ స్టూడియో వాళ్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్‌లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. గతంలో తెలుగులో చాణక్యునిపై ఎన్టీఆర్ దర్శక నిర్మాణంలో ‘చాణక్య చంద్రగుప్త’ అనే సినిమా తెరకెక్కింది. అక్కినేని నాగేశ్వర్‌ రావు చాణక్యుడిగా నటించిన ఈ మూవీలో ఎన్టీఆర్ చంద్రగుప్తుని పాత్రలో నటించాడు. ఈ మూవీ వచ్చిన చాల సంవత్సరాల తర్వాత రామారావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సమ్రాట్ అశోక’లో ఎన్టీఆర్ చాణుక్యుడి పాత్రను పోషించడం విశేషం.

  చాణక్య చంద్రగుప్తలో ఎన్టీఆర్,ఏఎన్నార్, శివాజీ గణేషణ్ (Twitter/Photo)


  ఇపుడు బాలీవుడ్‌లో తెరకెక్కబోతున్న ‘చాణక్య’ మూవీలో అజయ్ ఏ రకంగా ఈ పాత్రను ఎలా రక్తి కట్టిస్తాడో చూడాలి.మరోవైపు అజయ్ దేవ్‌గణ్.. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’లో ముఖ్యపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రం వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల కానుంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: