మహా సముద్రం కోసం మరోసారి జంటగా.. సాయిపల్లవి శర్వానంద్‌..

దర్శకుడు అజయ్ భూపతి.. కొత్త వారితో తీసిన 'ఆర్‌ఎక్స్‌100' మంచి విజయాన్ని అందుకుంది.

news18-telugu
Updated: April 19, 2020, 2:50 PM IST
మహా సముద్రం కోసం మరోసారి జంటగా.. సాయిపల్లవి శర్వానంద్‌..
సాయి పల్లవి, శర్వానంద్ Photo : Twitter
  • Share this:
దర్శకుడు అజయ్ భూపతి.. కొత్త వారితో తీసిన 'ఆర్‌ఎక్స్‌100' మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆయన రెండో చిత్రాన్ని తీసే ప్రయత్నం చేస్తుండగా.. ఎంతకీ ఆ సినిమా మందుకు సాగట్లేదు. తన రెండో సినిమాకు మహాసముద్రం అనే పేరు పెట్టాడు అజయ్. ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా ఆయన ఈ సినిమా కథను మొదట రవితేజకు వినిపించాడు. ఏమైందో ఏమో రవితేజతో ఆ సినిమా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత అదే కథను నాగచైతన్యకు కథ వినిపించాడు అజయ్. ఆయన మహాసముద్రం చేయడానికి ముందుకురాలేదు. దీంతో ప్రస్తుతం ఆ సినిమా కథ శర్వానంద్‌కి వినిపిస్తే.. ఫైనల్‌గా శర్వా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట. ఆయన తాజాగా సమంత కలిసి తమిళ సూపర్ హిట్ సినిమా 96ను తెలుగులో జాను పేరుతో వచ్చిన రీమేక్‌లో నటించి ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఈ మహాసముద్రంలో శర్వానంద్ సరసన టాలెంటెడ్ యాక్టర్ సాయిపల్లవి నటించనుందని సమాచారం.

అంతేకాదు ఈ కథని దర్శకుడు అజయ్ ఇప్పటికే సాయిపల్లవికి నెరేట్‌ చేయగా.. ఆమెకు కథ నచ్చి నటించేందుకు పచ్చ జెండా కూడా ఊపినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరూ కలిసి హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన పడి పడి లేచే మనసులో నటించిన సంగతి తెలిసిందే. కాగా సాయిపల్లవి ప్రస్తుతం నాగచైతన్యతో 'లవ్‌స్టోరీ' చిత్రంలోనూ నటిస్తోంది. ఈ సినిమాను శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు.
Published by: Suresh Rachamalla
First published: April 19, 2020, 2:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading