AJAY BHUPATHI MAHA SAMUDRAM PRE RELEASE BUSINESS AND SHARWANAND SIDDHARTH NEED TO BE SCORE BIG AT BOX OFFICE PK
Maha Samudram pre release business: ‘మహా సముద్రం’ ప్రీ రిలీజ్ బిజినెస్.. శర్వానంద్ ముందు భారీ లక్ష్యం..
మహా సముద్రం ట్విట్టర్ రివ్యూ (Maha Samudram Photo : Twitter)
Maha Samudram pre release business: ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసింది మహా సముద్రం (Maha Samudram) సినిమా. ప్యూర్ ఇన్టెన్స్ లవ్ స్టోరీగా ఈ చిత్రం వస్తుంది. ట్రైలర్లో యాక్షన్ ఎపిసోడ్స్ బాగానే కనిపిస్తున్నా.. లోపల మాత్రం మొత్తం ప్రేమకథనే ఉందంటున్నాడు అజయ్ భూపతి. దాదాపు పదేళ్ళ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి సిద్ధార్థ్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం మహా సముద్రం. ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్ విడుదలైన తర్వాత అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. పైగా ఆర్ఎక్స్ 100 తర్వాత మూడేళ్ళకు పైగా గ్యాప్ తీసుకుని అజయ్ భూపతి చేసిన సినిమా ఇది. ప్యూర్ ఇన్టెన్స్ లవ్ స్టోరీగా ఈ చిత్రం వస్తుంది. ట్రైలర్లో యాక్షన్ ఎపిసోడ్స్ బాగానే కనిపిస్తున్నా.. లోపల మాత్రం మొత్తం ప్రేమకథనే ఉందంటున్నాడు అజయ్ భూపతి. దాదాపు పదేళ్ళ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి సిద్ధార్థ్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇది తనకు రీ లాంఛ్ అవుతుందని నమ్మకంగా చెప్పాడు ఈయన. ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధూ మాటలు విన్న తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చేసింది. అయితే అంచనాలు కూడా అలాగే పెంచేసాడు ఈయన.
ఇలాంటి సినిమా ఈ మధ్య కాలంలో రాలేదని.. కచ్చితంగా థియేటర్స్ నుంచి బయటికి వచ్చేటప్పుడు బరువైన హృదయాలతో వస్తారని నమ్మకంగా చెప్పాడు సిద్ధార్థ్. శర్వానంద్ కూడా ఈ చిత్రంపై నమ్మకంగా కనిపిస్తున్నాడు. ఈ ఇద్దరికి సినిమా విజయం కీలకంగా మారింది. శర్వానంద్‌కు సరైన విజయం వచ్చి చాలా రోజులైపోయింది. ఇక సిద్ధూ సంగతి ఏం చెప్పాల్సిన అవసరం లేదు.
తెలుగులో మళ్లీ అవకాశాలు రావాలంటే ఈ చిత్రం హిట్ అవ్వాల్సిందే. మహా సముద్రం సినిమాకు ప్రీ రిలీజ్ కూడా బాగానే జరిగింది. హిట్ కావాలంటే దాదాపు 18 కోట్లు వసూలు చేయాలి. మరి ఈ చిత్ర ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో చూద్దాం..
ఏపీ + తెలంగాణ: 15.2 కోట్లు షేర్ రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 1.50 కోట్లు వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్: 16.70 కోట్లు షేర్
ఈ సినిమా కచ్చితంగా భారీ విజయం సాధిస్తుందని నమ్మకంగా ఉన్నారు దర్శక నిర్మాతలు. పైగా ఇప్పుడు జగన్ ప్రభుత్వం కూడా అనుకోని వరం అందించింది. ఇన్ని రోజులు కేవలం మూడు షోలు.. 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉండేది. కానీ తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నిర్మాతలు ఆనందంగా ఉన్నారు.
మూడు షోలు అలాగే ఉన్నా.. 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడుపుకోవచ్చు అంటూ అనుమతులు ఇచ్చారు జగన్. దాంతో బయ్యర్లు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇది మహా సముద్రం సినిమాకు హెల్ప్ అయ్యేలా కనిపిస్తుంది. పాజిటివ్ టాక్ వస్తే దసరా హాలీడేస్ కూడా ఉన్నాయి కాబట్టి భారీ వసూళ్లు రావడం ఖాయంగా కనిపిస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.