సూపర్ హిట్ సినిమా RX100కు సీక్వెల్.. మరో కొత్త అమ్మాయితో..

RX100 అంత కొత్తవారితో వచ్చిన ఈ చిత్రం ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలై బంపర్ హిట్ అయ్యింది.

news18-telugu
Updated: April 26, 2020, 12:39 PM IST
సూపర్ హిట్ సినిమా RX100కు సీక్వెల్.. మరో కొత్త అమ్మాయితో..
Rx100 పోస్టర్ Photo : Twitter
  • Share this:
RX100 అంత కొత్తవారితో వచ్చిన ఈ చిత్రం ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలై బంపర్ హిట్ అయ్యింది. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో, హీరోయిన్స్‌గా పరిచయమై తమ నటనతో అదరగొట్టారు. దాదాపు రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు 20 కోట్ల దాకా వసూళ్లను రాబట్టింది. రెవెన్యూ పరంగానే కాకుండా సినిమాలో నటించిన పాయల్‌కు, హీరోగా చేసిన కార్తికేయకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాతో సూపర్ పాపులరైన పాయల్ రాజ్ పుత్ తెలుగులో మోస్ట్ హ్యపెనింగ్ హీరోయిన్ గా వరుస అవకాశాలను అందుకుంటుంది. హీరో కార్తికేయ కూడా వరుస సినిమాలు చేస్తూ అదరగొడుతున్నాడు. అజయ్ భూపతి డైరక్షన్ లో వచ్చిన ఈ ఆరెక్స్ 100 సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతుందని సమాచారం. అజయ్ ప్రస్తుతం మహాసముద్రం అనే సినిమాను చేస్తున్నాడు. శర్వానంద్, సాయి పల్లవిలు జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తికాగానే RX100కు సీక్వెల్ రానుందని తెలుస్తోంది. అజయ్ భూపతి తాజాగా ఆర్ఎక్స్ 100 సినిమా రెండేళ్లు పూర్తి అయిన సందర్బంగా సోషల్ మీడియాలో ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సందర్బంగా ఆయన సీక్వెల్ ను ప్రకటించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖచ్చితంగా ఈ సినిమాకు సీక్వెల్ ను తీస్తాను. సీక్వెల్ స్టోరీ కూడా కార్తికేయకు సూట్ అయ్యేలా ఉంటుందని పేర్కోన్నాడు. ఈ తాజా సీక్వెల్‌కు హీరోయిన్ గా కొత్త అమ్మాయిని తీసుకోవాలని అనుకుంటున్నాడట దర్శకుడు. పేరుకు మాత్రమే సీక్వెల్‌గా ఉంటూ మొదటి కథకు పూర్తి విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందనుందని సమాచారం.
Published by: Suresh Rachamalla
First published: April 26, 2020, 12:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading