RRR - Rajamouli - Ntr: RRR’ లో మరో హీరోయిన్.. ఈ భామ ఎవరి కోసమో..?

Aiswarya Rajesh as another heroine in RRR with young tiger Ntr

RRR - Rajamouli - Ntr: ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ జతగా మరో హీరోయిన్‌ను నటింప చేయాలని రాజమౌళి భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 • Share this:
  యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌లు హీరోలుగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి అలియాస్ జక్కన్న దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న పిరియాడిక్ యాక్షన్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుథిరం). ఇందులో తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు పాత్రలో చెర్రీ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాలో ఇంటర్నేషనల్ స్థాయి ఉన్న నటీనటులను జక్కన్న తీసుకున్నారు. చరణ్‌ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, ఎన్టీఆర్‌ సరసన బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్ నటిస్తుండగా.. అజయ్ దేవగన్, శ్రీయ శరణ్ ఇతర ముఖ్య పాత్రల్లో మెరవబోతున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. మరోవైపు ఫస్ట్ లుక్స్, గ్లిమ్స్ అయితేనేం అదిరిపోయాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  అదేమిటంటే.. ఇప్పటి వరకూ పైన చెప్పిన నటీనటులు అని అనుకుంటుండగా తాజాగా మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఆ భామే ఐశ్వర్య రాజేష్. ఈ మధ్యే ఐశ్వర్యను తీసుకున్నారట. త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటుందని సమాచారం. ఈ బ్యూటీ పాత్ర సినిమాలో హైలైట్‌గా నిలుస్తుందని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా.. ఎన్టీఆర్ ఓ గిరిజన యువతిని ప్రేమిస్తాడట. ఈ పాత్ర కనిపించేది కాసేపయినా అదిరిపోతుందట. ఆ పాత్రకు ఎవర్ని తీసుకోవాలా..? అని వెతికిన జక్కన్నకు ఐశ్వర్య నచ్చడంతో ఆమెను తీసుకున్నారట. అయితే ఫలానా పాత్రలో చేయాలని... తక్కువ సీన్లు మాత్రమే ఉంటాయని సినిమా యూనిట్ చెప్పగా.. ఇంత పెద్ద సినిమాలో అవకాశం రావడమే గొప్ప విషయమని చెప్పి ఆమె ఓకే చెప్పేసిందట.

  గత 24 గంటలుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇంతవరకూ దర్శకుడు కానీ.. నిర్మాత కానీ.. మరోవైపు ఐశ్వర్య రాజేష్ కానీ ఎవరూ ఖండించలేదు. దీంతో ఈ వార్తకు మరింత బలం చేకూరినట్లయ్యింది. వాస్తవానికి ఐశ్వర్య రాజేష్.. మంచి నటీమణే.. ఇప్పటి వరకూ ఆమె చేసిన సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు దక్కించుకుని నిలబడింది. అటు తమిళంలో.. ఇటు తెలుగులో మంచి మంచి సినిమాలో చేసింది. అంతేకాదు.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా చేసి తన రేంజ్ ఏంటో చాటి చెప్పింది. అలాంటి ఐశ్వర్యకు ‘ఆర్ఆర్ఆర్’లో ఛాన్స్ వచ్చిందనే విషయం నిజమైతే మాత్రం ఈ బ్యూటీ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదేమో. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడక తప్పదేమో!.
  Published by:Anil
  First published: