• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • AISHWARYA RAJESH WILL BE SEEN AS TAXI DRIVER FOR HER LATEST FILM DRIVER JAMUNA SR

Aishwarya Rajesh : టాక్సీ డ్రైవర్‌గా మారిన తెలుగు హీరోయిన్..

Aishwarya Rajesh : టాక్సీ డ్రైవర్‌గా మారిన తెలుగు హీరోయిన్..

Aishwarya Rajesh Photo : Twitter

Aishwarya Rajesh : అందరి హీరోయిన్స్‌లా కాకుండా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది నటి ఐశ్వర్య రాజేష్‌.

  • Share this:
    అందరి హీరోయిన్స్‌లా కాకుండా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది నటి ఐశ్వర్య రాజేష్‌. ఎప్పటికప్పుడు వైరటీ పాత్రలతో అలరిస్తోన్న ఐశ్వర్య రాజేష్ తాజాగా మరో వైవిధ్యమైన పాత్రలో కనిపించేందుకు రెడీ అయ్యింది. తాజాగా ఓ సినిమా కోసం ట్యాక్సీడ్రైవర్‌ పాత్రలో కనిపించనుంది. తెలుగు తమిళ భాషాల్లో వస్తున్న డ్రైవర్‌ జమున అనే చిత్రంలో నటి ఐశ్వర్యరాజేష్‌ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని 18 రీల్స్‌ పతాకంపై డాక్టర్‌ ఎస్పీ చౌదరి నిర్మిస్తున్నారు. వత్తికుచ్చి వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన కిన్స్‌ లిన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. డ్రైవర్ జమున సినిమాకు జిబ్రాన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో నటి ఐశ్వర్య రాజేష్‌ కాల్‌ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకోనుందో..

    ఇక ఐశ్వర్య రాజేష్‌ కెరీర్ విషయానికి వస్తే.. తెలుగమ్మాయి అయినా.. ఈ భామకు తమిళ్‌లో మాంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ అక్కడ హీరోయిన్‌‌గా రాణిస్తూ పలు సినిమాల్లో నటించి అదరగొట్టింది. తెలుగులో పెద్దగా ఆదరణ లేకపోయినా తమిళ్‌లో మాత్రం మంచి రోల్స్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఐశ్వర్య రాజేష్ కెరీర్ ఆరంభంలో తమిళ హీరో విజయ్ సేతుపతితో కలిసి రమ్మీ, పన్నైరమ్ చిత్రాల్లో నటించి తమిళ్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇటీవల తెలుగులో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సరసన క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నటించింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ తన నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక ఆమె ప్రస్తుతం డ్రైవర్ జమున చిత్రంతో పాటు మరో వైవిధ్యమైన చిత్రంలో నటిస్తోంది. మలయాళంలో వచ్చి.. మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్న ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ తమిళ్, తెలుగు భాషాల్లో రీమేక్ కానుంది. ఈ సినిమా తమిళ రీమేక్‌లో ఐశ్వర్య ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో ఆమెకు జోడీగా రాహుల్ రవీంద్రన్ నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

    ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక సంప్రదాయ కుటుంబంలోకి కోడలిగా వచ్చిన అమ్మాయి.. ఆ ఇంట్లో కట్టుబాట్ల వల్ల ఎలా ఇబ్బంది పడింది. ముఖ్యంగా ఓ చదువుకున్న అమ్మాయి.. సంప్రదాయం, కట్టుబాట్ల కారణంగా ఎలాంటీ అవస్థలు పడింది. కట్టుబాట్ల పేరుతో ఆ మహిళ ఎదుర్కోన్న వివక్ష మొదలగు అంశాలను చర్చించనున్నారు. ఇక ఐశ్వర్య తెలుగు సినిమాల విషయానికి వస్తే.. నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తోన్న టక్ జగదీష్ అనే ఓ మాస్ మసాల సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు దేవా కట్టా సాయి తేజ్ పొలిటిక్ డ్రామా రిపబ్లిక్‌లో కూడా కీలకపాత్రలో నటిస్తోంది. ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.
    Published by:Suresh Rachamalla
    First published: