ఐశ్వర్య రాజేష్.. (Aishwarya Rajesh) తెలుగు సినిమా ప్రియులకు ఈ పేరు పరిచయం చేయాల్సిన పనిలేదు. తాజాగా ఈ భామ సినిమాలతో బిజీగా మారింది. అటు తమిళంతో పాటు.. ఇటు తెలుగులో కూడా ఐశ్వర్య వరుస సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె కిన్ స్లిన్ దర్శకత్వంలో ఓ చిత్రంలో క్యాబ్ డ్రైవర్(Cab Driver) పాత్రను చేస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను గురువారం విడుదల చేసింది మూవీ టీం. తమిళంతో పాటు ఈ సినిమాను తెలుగు, మలయాళ భాషల్లోనూ విడుదల చేయాలన్నది చిత్ర నిర్మాణ సంస్థ 18 రీల్స్ రెడీ అవుతోంది. అన్ని భాషల్లోనూ దీనికి ‘డ్రైవర్ జమున’(Driver Jamuna) అనే పేరునే ఖరారు చేశారు.
ఈ మూవీకి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. అవుట్ అండ్ అవుడ్ రోడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్విస్టులు, కీలక మలుపులతో సాగనుంది. మరోవైపు డ్రైవర్ జమున సినిమా ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ సినిమా గురించి దర్శకుడు కిన్ స్లిన్ మాట్లాడుతూ.. ఐశ్వర్యా రాజేశ్ సినిమా అంటేనే సమ్ థింగ్ స్పెషల్ అనే భావన ప్రేక్షకులలో ఉందన్నారు. దానికి తగ్గట్టుగానే ఈ కథను తయారు చేయడం జరిగిందని తెలిపారు.
ఇవాళ టాక్సీ ఇండస్ట్రీ ఇంపార్టెన్స్ చాలా పెరిగింది. దీంతో క్యాబ్ డ్రైవర్లకు సంబంధించిన అంశాలను ఇందులో డీల్ చేస్తున్నామన్నారు. అందులోనూ ప్రత్యేకంగా ఓ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన లేడీ డ్రైవర్ జీవితాన్ని చూపించబోతున్నామన్నారు. ఈ క్రైమ్ థిల్లర్ కోసం తన బాడీని మరింత దృఢం చేసుకోవడానికి ఐశ్వర్యా రాజేశ్ కృషి చేస్తోంది. అలానే క్యాబ్ డ్రైవర్స్ ను కలిసి, వారి బాడీ లాంగ్వేజ్ ను గమనించి, దానికి అనుగుణంగా తనని తాను మలుచుకునే ప్రయత్నం చేస్తోందని ఈ సినిమా డ్రైవర్ చెబుతున్నారు.
ఐశ్వర్యా రాజేశ్ పేరుకు తమిళ హీరోయిన్ అయినా కూడా ఈమె అచ్చ తెలుగమ్మాయి. ఈమె తండ్రి రాజేష్ తెలుగులో ఒకప్పుడు మంచి నటుడు. జంధ్యాల తెరకెక్కించిన సినిమాల్లో హీరోగా నటించాడు. సన్ టీవీలో అస్తోపోవధ్ యారు అనే కామెడీ షోలో ఆమె యాంకర్‌గా తన కెరిర్ మొదలు పెట్టింది. . విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సువర్ణగా పరిచయం అయింది. ప్రస్తుతం ఐశ్వర్యా రాజేశ్ తమిళంలో నాలుగు సినిమాలు, మలయాళంలో ఓ సినిమా చేస్తోంది. గతేడాది తెలుగులో నానితో కలిసి టక్ జగదీష్, సాయిధరమ్ తేజ్‌తో కలిసి రిపబ్లిక్ సినిమాలో మెరిసింది ఐశ్వర్య. ఈ రెండు చిత్రాలు బాక్సాపీస్ వద్ద డీలా పడ్డాయి.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.