పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఎ ఎం రత్నం నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఓ కీలక రోల్ కోసం తెలుగు అమ్మాయి ఐశ్వర్యా రాజేష్ నటించనుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో పవన్ ను చూసి ఓ గిరిజిన యువతి ప్రేమలో పడుతుందని.. ఆ పాత్రలో ఆ ప్రేమించే హీరోయిన్ గా ఐశ్వర్యా రాజేష్ ను తీసుకోవాలనే ఆలోచనలో క్రిష్ ఉన్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. కాగా పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో వస్తోన్న ఈ సినిమాలో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వస్తున్నాయి. చిత్రబృందం ఈ సినిమాకు ‘విరూపాక్ష’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు టాక్. దీనిపై క్లారిటీ రావాల్సిఉంది. ఇక ఐశ్వర్య రాజేష్.. విషయానికి వస్తూ.. తెలుగు అమ్మాయే అయిన మొదట తమిళ్లో నటించి అక్కడ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ ఆ మధ్య తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో నటించి మరోసారి తనెంటో నిరూపించుకుంది. ఐశ్వర్వ ప్రస్తుతం తెలుగులో నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తోన్న ఓ సినిమాలో నటిస్తోంది.
ఐశ్వర్య Photo : Twitter
ఇక పవన్ కళ్యాణ్ చేస్తోన్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయినా అయ్యప్పనుమ్ కోషియమ్.. అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. మరో కీలక పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలకు ఓకే చెప్పుతున్నాడు. ఆయన ఇప్పటికే ‘వకీల్ సాబ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా హిందీ సినిమా పింక్‌కు రీమేక్ గా వస్తోంది. ఈ సినిమా షూటింగ్ తాజాగా షూటింగ్ ముగిసింది. ఈ సినిమా తర్వాత ఆయన మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ సుమారు 40 రోజులు డేట్స్ కేటాయించారట. ఇందుకు గాను భారీ రెమ్యునరేషన్ నే తీసుకుంటున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. నలబై రోజుల డేట్స్ కోసం 50 నుంచి 55 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ ను తీసుకున్నట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. అది కూడా విడతల వారీగా కాకుండా.. ముహూర్తానికి ముందే సింగిల్ పేమెంట్ అందుకున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాలో కూడా రానా సరసన ఐశ్వర్యా రాజేష్ నటించే అవకాశం ఉందని సమాచారం. పవన్ పక్కన సాయిపల్లవి నటించనుంది. ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు బిల్లా రంగ అనే టైటిల్‌ను పరిశీలిస్తోందట చిత్రబృందం. ఈ సినిమాతో పాటు పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాను చేయనున్నాడు. వీటితో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఓ సినిమాను చేయనున్నట్లు సమాచారం.