AISHWARYA RAJESH COMMENTS ON REBEL STAR PRABHAS NR
Aishwarya Rajesh: 'ప్రభాస్'కు అలాంటి కాంప్లిమెంట్ ఇచ్చిన ఐశ్వర్య రాజేష్.. ఏంటంటే?
Aishwarya Rajesh: బాహుబలి.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమా బాహుబలి తర్వాత ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పెరిగారు.
Aishwarya Rajesh: బాహుబలి.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమా బాహుబలి తర్వాత ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పెరిగారు.
Aishwarya Rajesh: బాహుబలి.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమా బాహుబలి తర్వాత ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పెరిగారు. ప్రభాస్ కు కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కు అభిమానులు ఉన్నారు. ప్రభాస్ కు సినీ ఇండస్ట్రీలో కూడా దర్శక నిర్మాతల నుండి నటీనటుల వరకూ కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇక తాజాగా మరో నటి ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపింది.
ఆమె ఎవరో కాదు.. పలు భాషల్లో నటించిన తమిళ నటి ఐశ్వర్య రాజేష్. ఈమె తెలుగులో క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించింది. సినిమా సూపర్ హిట్ అవ్వకపోయిన ఆమె పాత్ర మాత్రం అభిమానులను భారీస్థాయిలో ఆకట్టుకుంది. తెలుగులో పెద్దగా అభిమానులు లేకపోయినా తమిళ్, మలయాళం భాషల్లో మంచి ఫ్యాన్ క్రేజ్ ను సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఐశ్వర్య రాజేష్ హీరో ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ప్రభాస్ 2005లో రాజమౌళి దర్శకత్వంలో నటించిన చత్రపతి సినిమాలో హీరోగా నటించగా.. ఈ సినిమా అప్పట్లో రికార్డులు బద్దలు కొట్టింది. ఇక ఈ సినిమాలో డైలాగ్స్ లకు ఎంత క్రేజ్ వచ్చిందో తెలిసిన విషయమే. ఇక ఈ సినిమాలో 'ఒక్క అడుగు' డైలాగ్ ప్రభాస్ కి తప్ప మరే హీరోలకు అంత ఈజీ కాదు అంటూ ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో ఆయన మాస్ సీన్స్ ఎంతగానో బాగుంటాయంటూ.. ఇలాంటి మాస్ సీన్స్ ప్రభాస్ లా ఎవరు చేయలేరంటూ ప్రభాస్ ను పొగిడేసింది ఐశ్వర్య రాజేష్.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.