వెంకటేష్ సరసన ఐశ్వర్యారాయ్.. జయంత్ దర్శకత్వంలో.. కానీ..

వెంకటేశ్‌ హీరోగా జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో 1997లో విడుదలైన సూపర్ హిట్ సినిమా ‘ప్రేమించుకుందాం రా’.

news18-telugu
Updated: April 17, 2020, 12:32 PM IST
వెంకటేష్ సరసన ఐశ్వర్యారాయ్.. జయంత్ దర్శకత్వంలో.. కానీ..
ఐశ్వర్య, వెంకటేష్ Photo : Twitter
  • Share this:
వెంకటేశ్‌ హీరోగా జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో 1997లో విడుదలైన సూపర్ హిట్ సినిమా ‘ప్రేమించుకుందాం రా’. ఈ సినిమాలో వెంకీ సరసన కొత్త అమ్మాయి అంజలా ఝవేరి నటించింది. లవ్ ఫ్యాక్షన్ కలయికలో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేశ్‌ అంజలా ఝవేరిల మధ్య జరిగే రొమాన్స్.. ఆ సినిమాలో పాటలు తెలుగు ప్రేక్షకుల్నీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే మొదట ఈ సినిమాలో వెంకీ సరసన అందాల ఐశ్వర్యారాయ్‌ను అనుకున్నాడట డైరెక్టర్ జయంత్‌. ఇంతకు ముందే జయంత్‌కు ఐశ్వర్యకు పాత పరిచయం ఉందట. దీంతో ఆమెను తీసుకోవాలని భావించాడట. అందులో భాగంగా ఈ విషయాన్ని చిత్ర బృందానికి తెలిపితే.. వారు నో అన్నారట. కారణం ఏమంటే అప్పటికే ఐశ్వర్య నటించిన రెండు మూడు సినిమాలు పెద్దగా అలరించలేకపోయాయి. దీంతో ఆమెకు ఫ్లాప్‌ హీరోయిన్‌ అనే పేరుంది. దాన్ని సెంటిమెంట్‌గా భావించిన చిత్రబృందం ‘ప్రేమించుకుందాం రా’ సినిమాలో నటించే అవకాశం ఇవ్వలేదు. అయితే ఆ తర్వాత ఆమె హిందీ సినిమాల్లో నటిస్తూ మంచి విజయాలను అందుకుని సూపర్ స్టార్ అయ్యింది.

ఆ తర్వాత ఐశ్యర్య మరో తెలుగు సినిమాలో నటించలేదు. అలా ‘ప్రేమించుకుందాం రా’ సినిమాలో ఐశ్యర్య అవకాశాన్ని మిస్ చేసుకుంది. ఇక అప్పటి నుండి ఏ తెలుగు సినిమాలో నటించని నాగార్జున హీరోగా జయంత్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రావోయి చందమామ’లో ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. ఐశ్యర్యరాయ్ ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో పిరియాడిక్ జానర్ వస్తోన్న ‘పొన్నియన్‌ సెల్వన్‌’లో నటిస్తోంది. ఏ ఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
Published by: Suresh Rachamalla
First published: April 17, 2020, 12:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading