మరోసారి సంచలన పాత్రలో ఐశ్వర్యా రాయ్.. షాక్‌లో అభిమానులు..

రాశి కంటే వాసి ముఖ్యం అన్నట్టు.. అనుభవం తెచ్చిన మార్పో.. నటిగా గుర్తింపు కోరుకునే ఆలోచనో కానీ.. పాత్రలో కొత్తదనం ఉంటే ఐశ్వర్యా రాయ్ ఓకే చెబుతోంది. తాజాగా  ఐశ్వర్యా రాయ్ మరోసారి సంచలన పాత్ర చేయడానికి ఐశ్వర్య రాయ్ ఓకే చెప్పినట్టు సమాచారం.

news18-telugu
Updated: January 22, 2020, 12:43 PM IST
మరోసారి సంచలన పాత్రలో ఐశ్వర్యా రాయ్.. షాక్‌లో అభిమానులు..
ఐశ్వర్య రాయ్ (Photo: aishwaryaraibachchan_arb/Instagram)
  • Share this:
రాశి కంటే వాసి ముఖ్యం అన్నట్టు.. అనుభవం తెచ్చిన మార్పో.. నటిగా గుర్తింపు కోరుకునే ఆలోచనో కానీ.. పాత్రలో కొత్తదనం ఉంటే ఐశ్వర్యా రాయ్ ఓకే చెబుతోంది. తాజాగా  ఐశ్వర్యా రాయ్ మరోసారి సంచలన పాత్ర చేయడానికి ఐశ్వర్య రాయ్ ఓకే చెప్పినట్టు సమాచారం. తాజాగా ఈ మాజీ ప్రపంచ సుందరి.. వేశ్య నుంచి రంగస్థల నటిగా మారి ఆ తర్వాత గాయనిగా ఎదిగిన బినోదిని బయోపిక్ లో నటించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్‌లో బయోపిక్ ల హవా కొనసాగుతుండడంతో ఆమె కూడా ఈ ప్రాజెక్ట్ లో నటించనున్నట్లు సమాచారం. 19వ దశాబ్దంలో బెంగాల్‌కు చెందిన వేశ్య బినోదిని ... రంగస్థల నటిగా మారి ఆ తరువాత నాటకాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి అనంతరం గాయనిగా మారిన ఆమె ప్రస్థానం ఎంతో మందికి ఆదర్శం. ఇపుడీ నటి బినోదిని జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ప్రదీప్ సర్కార్ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రంలో ఐశ్వర్యా బినోదిని పాత్రలో నటించబోతోంది. ముందుగా ఈ పాత్రను దీపికా పదుకొనే చేత నటింపజేయాలని అనుకుని ఆమెను సంప్రదించాడట దర్శకుడు సర్కార్.

ఐశ్వర్యారాయ్ ఫోటోషూట్ (Twitter)


ముందుగా ఈ కథ విని బాగుందన్న దీపికా.. చివరకు ఇంత భారీ పాత్రలు తాను చేయబోనని తేల్చి చెప్పేసిందిట దీపికా. ‘పద్మావత్’ తర్వాత దీపికా భారీ చేయోద్దనే నిర్ణయానికి వచ్చిందట. అందుకే ఈ చిత్రంలో ఆమె యాక్ట్ చేయడానికి నో చెప్పిందట. దీంతో దర్శకుడు ప్రదీప్ సర్కార్ ఇదే స్క్రిప్ట్‌తో ఐశ్వర్యను సంప్రదించగా ఆమె కథను విని చేసేందుకు ఆసక్తి చూపించినట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐశ్వర్యారాయ్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంలో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం.

First published: January 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు