హోమ్ /వార్తలు /సినిమా /

Rajnikanth: ఐశ్వర్యరాయ్‌తో మరోసారి జోడీ కట్టనున్న సూపర్ స్టార్

Rajnikanth: ఐశ్వర్యరాయ్‌తో మరోసారి జోడీ కట్టనున్న సూపర్ స్టార్

(Photo Credit: Instagram)

(Photo Credit: Instagram)

జనీ తన కెరీర్ లో 169వ చిత్రంగా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ జూలై నుంచి స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajnikanth) హీరోగా వచ్చిన రోబో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందా. తెలుగు, హిందీ, తమిళ భాషాల్లో ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో అందాల ఐశ్వర్య రాయ్(Aishwarya Rai) హీరోయిన్‌గా నటించింది. అయితే తాజాగా ఈ జంట మరోసారి కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ తలైవర్ రజినీకాంత్(Rajnikanth) హీరోగా ప్రస్తుతం కోలీవుడ్ హిట్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఒక భారీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రజనీ తన కెరీర్ లో 169వ చిత్రంగా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ జూలై నుంచి స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది.

అయితే ఈ సినిమాపై నిన్ననే మేకర్స్ ఒక బిగ్ అనౌన్సమెంట్ కూడా ఇచ్చారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా పై ఇంట్రెస్టింగ్ టాక్ ఒకటి బయట వినిపిస్తుంది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ సరసన మరోసారి ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటించబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ కాంబోలో ఇది వరకే “రోబో” సినిమా చూసాము. మరి ఇది నిజం అయితే మళ్ళీ ఇప్పుడు చూడబోతున్నామని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ మరియు ఏ జి ఎస్ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

ఇటీవలే ఐఫా అవార్డ్స్(Iifa Awards) ఫంక్షన్‌లో ఐశ్వర్య రాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్‌తో కలిసి సందడి చేసింది. ఈ జంట ఫంక్షన్‌లో హైలెట్‌గా నిలిచింది.  అయితే ఈ మధ్య కాలంలో ఐశ్వర్య లుక్, డ్రెస్సింగ్ పై భయంకరంగా ట్రోలింగ్ నడుస్తోంది. మరోవైపు సినిమాల విషయానికి వస్తే.. ఐశ్వర్య రాయ్ బచ్చన్ తదుపరి మణిరత్నం పొన్నియిన్ సెల్వన్‌లో కనిపిస్తుంది. ఈ సినిమాలో రెండు భాగాలుగా విడుదల చేయడానికి షెడ్యూల్ చేయబడింది. అయితే అభిషేక్ బచ్చన్ చివరిగా దాస్వి సినిమాలో కనిపించారు.

First published:

Tags: Aishwarya Rai, Aishwarya Rai Bachchan, Rajnikanth

ఉత్తమ కథలు