AISHWARYA RAI BACHCHAN BRUTALLY TROLLED FOR LIP JOB NETIZENS WONDER IF SHE IS PREGNANT SB
Aishwarya Rai: ఐశ్వర్యరాయ్ మళ్లీ ప్రెగ్నెంట్...అందుకే అలా కవర్ చేస్తుందా ?
ప్రతీకాత్మక చిత్రం
ఐశ్వర్య రాయ్ కేన్స్ ఫెస్టివల్లో సందడి చేసిన విషయం తెలిసిందే.తాజాగా ఆమె చేసిన ఈ టూర్‌పై పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఐశ్వర్య రాయ్ లుక్ పై నెటిజన్లు భారీగా ట్రోల్ చేస్తున్నారు.
ఒకప్పటి మిస్ వరల్డ్.. అందగత్తె.. కళ్లతో మనసు దోచుకునే హీరోయిన్ ఐశ్వర్య రాయ్(Aishwarya Rai Bachchan). ఐశ్వర్య పేరు తెలియిన సీని అభిమానులు లేరు. దేవదాస్, ధూమ్ 2, జోధా అక్బర్, మోహబత్తేన్, గురు, గుజారిష్, తాల్, జోష్, రోబో, రావణ్, ప్రియురాలు పిలిచింది, సర్కార్ లాంటి ఎన్నో హిట్ చిత్రాలు ఐశ్వర్య రాయ్ ఖాతాలో ఉన్నాయి. స్టార్ హీరోయిన్గా ఉన్న సమయంలోనే అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan)తో ప్రేమలో పడి పెళ్లిచేసుకున్నారు. ఆపై ఆరాధ్యకు జన్మనిచ్చారు. పెళ్లి తర్వాత ఐష్ సినిమాలు తగ్గించారు. ఫ్యామిలీ, కూతురు ఆద్యకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.
అయితే తాజాగా ఐశ్వర్య రాయ్ బచ్చన్.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022(Cannes Film Festival) కు భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్యతో కలిసి వచ్చారు.కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్య రాయ్ మెరిసిపోయారు. బ్లాక్ కలర్ వాలెంటినో గౌన్‌లో 75వ కేన్స్ ఫెస్టివల్లో ఐశ్వర్య హోయలు పోయారు. అయితే ఆమె తిరుగు ప్రయాణంలో కూతురు ఆద్య,భర్తతో కలిసి కెమెరాలకు చిక్కారు. ఈ సందర్భంగా ప్రముఖ ఫోటోగ్రాఫర్, కంటెంట్ క్రియేటర్ వైరల్ భయాని... తాజాగా ఐశ్వర్య రాయ్‌కు సంబంధించి ఓ వీడియో పోస్టు చేశారు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఐశ్వర్య తన పొట్ట కనిపించకుండా కవర్ చేసుకుంటూ వస్తోంది. దీంతో ఇప్పుడు ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్స్ ఆమె ప్రగ్నెంట్ అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదే వీడియోలో ఐశ్వర్య తన కూతురు ఆద్య చేయి పట్టుకొని నడుస్తూ ఉంది. అయితే కూతురు చేయి ఎక్కడా వదల్లేదు. దీంతో కొందరు కూతుర్ని ఎంతో ప్రేమతో.. కేరింగ్‌గా పెంచుతుందని అంటున్నారు. మరికొందరు.. ఆమె ఏమైనా చిన్న పిల్లనా.. చేయి పట్టుకొని నడుస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక ఆమె తాజాగా కేన్స్ 2022లో సందడి చేసింది. తన కూతురు ఆరాధ్యతో కలిసి కేన్స్‌కి వచ్చిన ఆమె బ్లాక్ డ్రెస్ ధరించి సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్‌కి నిలువుటద్దంలా కనిపించింది. ఫొటోలకు పోజులిస్తూ అందరి హృదయాలను దోచుకుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తన చక్కని లుక్స్‌తో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఫ్యాషన్ డ్రెస్సింగ్‌తో స్టన్నింగ్ లుక్స్‌తో అందరి చూపుని తనవైపుకి తిప్పుకుంది. అయితే ఐశ్వర్య రాయ్ లుక్‌పై కూడా నెటిజన్స్ భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఆమె లిప్ జాబ్ చేయించుకుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఏజ్‌లో లిప్ సర్జరీలు ఎందుకంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.