ఐశ్వర్య రాయ్, ఆమె కూతురు ఆరాధ్యకు కరోనా నెగిటివ్..

Aishwarya Rai: వారం రోజుల కింద హోమ్ క్వారంటైన్ నుంచి హాస్పిటల్‌కు షిఫ్ట్ అయ్యారు ఐశ్వర్య రాయ్, ఆమె కూతురు ఆరాధ్య. ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినా కొన్ని రోజుల..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 27, 2020, 4:38 PM IST
ఐశ్వర్య రాయ్, ఆమె కూతురు ఆరాధ్యకు కరోనా నెగిటివ్..
ఐశ్వర్యారాయ్ బచ్చన్, ఆమె కూతురు ఆరాధ్య
  • Share this:
వారం రోజుల కింద హోమ్ క్వారంటైన్ నుంచి హాస్పిటల్‌కు షిఫ్ట్ అయ్యారు ఐశ్వర్య రాయ్, ఆమె కూతురు ఆరాధ్య. ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినా కొన్ని రోజుల వరకు ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. అయితే ఐశ్వర్య కంటే ముందే ఆమె మామ అమితాబ్ బచ్చన్, భర్త అభిషేక్ బచ్చన్‌కు కూడా కరోనా వచ్చింది. దాంతో వాళ్లు హాస్పిటల్‌లోనే ఉండిపోయారు. ఆ తర్వాత ఐశ్వర్య రాయ్, ఆరాధ్యకు కూడా కరోనా అటాక్ అయింది. తాజాగా ఈ ఇద్దరూ ముంబై లీలావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.


ఇదే విషయాన్ని ఐశ్వర్య భర్త అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేసాడు. తన భార్యతో పాటు కూతురుకు కూడా నెగిటివ్ వచ్చిందని.. దాంతో వాళ్లను డిశ్చార్జ్ చేసారని తెలిపాడు. కానీ తండ్రి అమితాబ్‌తో సహా తాను కూడా ఇంకా హాస్పిటల్‌లోనే ఉన్నామని.. మరికొన్ని రోజులు వైద్యుల సమక్షంలోనే ఉండాలని సూచించినట్లు తెలిపాడు అభిషేక్ బచ్చన్. మొత్తానికి లీలావతి హాస్పిటల్ నుంచి ఐశ్వర్య, ఆరాధ్య ఇద్దరూ డిశ్చార్జ్ కావడంతో అభిమానులు సంతోష పడుతున్నారు. అమితాబ్, అభిషేక్ కూడా త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు వాళ్లు.
Published by: Praveen Kumar Vadla
First published: July 27, 2020, 4:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading