Aishwarya Rai: ముంబై నానావతి హాస్పిటల్‌లో ఐశ్వర్యారాయ్, ఆరాధ్య..

Aishwarya Rai: నాలుగు రోజుల కింద ఐశ్వర్యారాయ్‌తో పాటు ఆమె కూతురు ఆరాధ్యకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. దానికి ముందే ఆమె మామ అమితాబ్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 17, 2020, 10:16 PM IST
Aishwarya Rai: ముంబై నానావతి హాస్పిటల్‌లో ఐశ్వర్యారాయ్, ఆరాధ్య..
ఐశ్వర్యారాయ్ బచ్చన్, ఆమె కూతురు ఆరాధ్య
  • Share this:
హోమ్ క్వారంటైన్ నుంచి హాస్పిటల్‌కు షిఫ్ట్ అయ్యారు ఐశ్వర్యారాయ్, ఆరాధ్య. నాలుగు రోజుల కింద ఈ ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. దానికి ముందే ఆమె మామ అమితాబ్ బచ్చన్, భర్త అభిషేక్ బచ్చన్‌కు కూడా కరోనా వచ్చింది. దాంతో వాళ్లు హాస్పిటల్‌లోనే ఉండిపోయారు. కానీ ఐశ్వర్యారాయ్, ఆరాధ్య మాత్రం ఇంట్లోనే ఉండిపోయారు. హోమ్ క్వారంటైన్ సరిపోతుందని అభిషేక్ కూడా ట్వీట్ చేసాడు. కానీ ఇప్పుడు అలా జరగలేదు.
అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు (amitabh bachchan fans puja)
అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు (amitabh bachchan fans puja)

ఐశ్వర్యతో పాటు ఆమె కూతురు కూడా ఇప్పుడు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. క్వారంటైన్‌లో ఉంటే సరిపోతుందని అభిషేక్ ట్వీట్ చేసాడు.. దాంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కానీ నాలుగు రోజుల తర్వాత కూడా ఈ ఇద్దరి పరిస్థితిలో మెరుగు కనిపించలేదు. కరోనా లక్షణాలు మరిన్ని బయట పడటంతో వెంటనే వాళ్లను హాస్పిటల్‌కు షిఫ్ట్ చేసారు. ప్రస్తుతం మామ, భర్త ఉన్న నానావతిలోనే ఐశ్వర్యారాయ్ కూడా అడ్మిట్ అయింది.
Published by: Praveen Kumar Vadla
First published: July 17, 2020, 10:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading