Video : ఐష్ గానా భజానా... ఫ్యాన్స్ ఫిదా

అభిమాన నటీనటులు అవార్డ్ ఫంక్షన్స్ అప్పుడు స్టేజ్ పై ఆడిపాడటం కామన్. ఇపుడు మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ స్టేజ్‌పై మెహబ్బత్ అంటూ ఆడిపాడిన పాట ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

news18-telugu
Updated: July 11, 2018, 4:51 PM IST
Video : ఐష్ గానా భజానా... ఫ్యాన్స్ ఫిదా
ఫన్నేఖాన్ (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: July 11, 2018, 4:51 PM IST
అభిమాన నటీనటులు అవార్డ్ ఫంక్షన్స్ అప్పుడు స్టేజ్ పై ఆడిపాడటం కామన్. ఇపుడు మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ స్టేజ్‌పై మెహబ్బత్ అంటూ ఆడిపాడిన పాట ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కానీ ఐశ్యర్య రాయ్ ఆడి పాడింది రియల్ లైఫ్‌లో కాదు...రీల్ లైఫ్‌లో. ఐష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న‘ఫన్నేఖాన్’ మూవీలోనిది ఈ పాట.

నటీనటులు రియల్ లైఫ్ క్యారెక్టర్స్‌ను రీల్ లైఫ్ లో చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. అటువంటి అరుదైన బేబి సింగ్ అనే హీరోయిన్ పాత్రను ‘ఫన్నేఖాన్’ మూవీలో చేస్తుంది ఈ మాజీ ప్రపంచ సుందరి. అనిల్ కపూర్ టైటిల్ పాత్రలో నటించిన ఈ మూవీలో రాజ్ కుమార్ రావు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. అతుల్ మంజ్రేకర్ డైరెక్ట్ చేసాడు.

మహమ్మద్ రఫీ లాగా పెద్ద గాయకుడు కావాలనుకున్న హీరో..పెళ్లిల్లో,స్టేజ్ షోస్‌లో పాటలు పాడే సింగర్ అవుతాడు. తను పెద్ద సింగర్ కావాలన్న కల నెరవేరని హీరో...తన కూతురును లతా మంగేష్కర్ అంత పెద్ద సింగర్‌ కావాలాని కోరుకుంటాడు. అంతేకాదు తన కూతురుకు లతా అని పేరు కూడా పెడతాడు. లావుగా వున్న అనిల్ కపూర్‌ కూతురు వాళ్ల కాలేజీ స్టేజ్‌పై పాటలు పాడుతుంటే ఆమె అవతారం చూసి మిగతా వాళ్లు హేళన చేస్తుంటారు. దీంతో హీరో తన కూతురుతో ఒక స్టేజ్ షో చేయించాలనుకుంటాడు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని అనిల్ కపూర్ ...హీరోయినైనా ఐశ్వర్యారాయ్‌ను తన స్నేహితుడి సాయంతో కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీని ఆగష్టు 3న రిలీజ్ చేస్తున్నారు.





 

 

 
First published: July 11, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...