ఎయిరిండియా చెత్త సేవలపై సోషల్ మీడియా వేదికగా మంచు లక్ష్మి ఏకిపారేయడం తెలిసిందే. కనీస సమాచారమైనా ఇవ్వకుండా పూణె విమానాశ్రయంలో గంటల తరబడి వెయిట్ చేయించారని ఆమె అసహనం వ్యక్తంచేశారు. ఎయిరిండియా సేవలపై మంచు లక్ష్మి చేసిన విమర్శల పట్ల ఎయిరిండియా స్పందించింది. ఎయిరిండియా విమానంలో ప్రయాణం సందర్భంగా ఆమెకు కలిగిన అసౌకర్యం పట్ల క్షమాపణ చెప్పింది. ఆమె అభిప్రాయాన్ని సంబంధిత విమానాశ్రయ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లినట్లు మంచు లక్ష్మి ట్వీట్‌కు సమాధానంతో ఎయిరిండియా అఫిషియల్ హ్యాండిల్ నుంచి ట్వీట్ చేశారు.
We are extremely sorry for your experience, Ms. Lakshmi. Your feedback has been highlighted to the concerned Airport Manager for necessary corrective measures in this regard.
— Air India (@airindiain) October 18, 2018
ఇదిలా ఉండగా ఎయిరిండియా విమానం ఆలస్యం కావడంపై మంచు లక్ష్మి చేసిన ట్వీట్‌పై స్పందించిన ఓ నెటిజన్ ‘ఈ ఇబ్బందులు అన్నీ ఎందుకు అక్కా.. సుబ్బరంగా ఓ చార్టర్డ్ ఫ్లైట్ కొనుక్కోవచ్చు కదా..’ అని సలహా ఇచ్చాడు. దీనికి ఆమె స్పందిస్తూ ‘నువ్వు కొను.. నేను ఎక్కుతా’ అని చెప్పింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Air India, Manchu Family