హోమ్ /వార్తలు /సినిమా /

Kriti Sanon: ప్రభాస్ బ్యూటీ కృతి సనన్‌పై ట్రోలింగ్‌.. ఆదిపురుష్ సినిమాపై ఎఫెక్ట్!

Kriti Sanon: ప్రభాస్ బ్యూటీ కృతి సనన్‌పై ట్రోలింగ్‌.. ఆదిపురుష్ సినిమాపై ఎఫెక్ట్!

Kriti Sanon

Kriti Sanon

Kriti Sanon: రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్‌కు కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కృతి సనన్ (Kriti Sanon) ట్వీట్ పై భారీ ట్రోలింగ్ జరుగుతోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్‌ (Adipurush) కు కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఆదిపురుష్ టీజర్‌ విడుదలైన తర్వాత చాలా మంది సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పాత్రల చిత్రీకరణను తప్పుబట్టారు. ఈ క్రమంలోనే 2020లో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో జరిగిన హింసపై నటి కృతి సనన్ (Kriti Sanon) స్పందించిన తీరు ఇప్పుడు వైరల్‌ అవుతోంది.ఆదిపురుష్‌(Adipurush)లో టాలీవుడ్ రెబల్‌స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్, కృతి సనన్‌ జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో కృతి సీత పాత్రను పోషిస్తున్నారు. తాజాగా కృతి సనన్‌ను ట్యాగ్‌ చేస్తూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

చాలా మంది జవహర్‌ లాల్‌ యూనివర్సిటీ అల్లర్లను ప్రస్తావిస్తున్నారు. 2020 జనవరిలో యూనివర్సిటీలో జరిగిన దాడులపై కృతి ట్విట్టర్‌ వేదికగా స్పందించింది. గుర్తుతెలియని ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు జేఎన్‌యూలోకి ప్రవేశించి విద్యార్థులను కొట్టారని తెలిపింది. జేఎన్‌యూ విద్యార్థులకు సంఘీభావంగా నిలిచింది. ఘటనను జేఎన్‌యూ ఉపాధ్యాయులు, విద్యార్థులపై దాడిగా అభివర్ణించారు.

ఆమె చేసిన ట్వీట్‌లో.. ‘జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో ఏం జరిగిందో చూస్తే నా గుండె పగిలిపోతుంది! భారతదేశంలో జరుగుతున్నది భయానకం!! ముసుగు ధరించిన పిరికిపందలు విద్యార్థులు & ఉపాధ్యాయులను కొట్టి, భయభ్రాంతులకు గురిచేస్తున్నారు!! కాన్‌స్టాంట్‌ బ్లేమ్‌ గేమ్! రాజకీయ అజెండాల కోసం ఇంత దిగజారుతున్నారు! హింస ఎప్పటికీ పరిష్కారం కాదు! మనం ఇంత అమానుషంగా ఎలా మారాం?’ అని పేర్కొన్నారు.

* JNUలో ఏం జరిగింది..?

జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ క్యాంపస్‌లోకి 2020 జనవరి 5న దాదాపు 100 మంది ముసుగులు ధరించిన వ్యక్తులు, రాడ్‌లు, సుత్తి వంటి ఆయుధాలతో చొరబడ్డారు. హాస్టళ్లు, ఇతర భవనాలకు వెళ్లి విద్యార్థులపై దాడులు జరిపారు. ఆస్తులను ధ్వంసం చేశారు. CAAకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు అక్కడికి వచ్చే సరికి 36 మంది విద్యార్థులు, సిబ్బంది, ఉపాధ్యాయులు గాయపడ్డారు. దాడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేశారు.

జేఎన్‌యూలో డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులు చాలా సందర్భాలలో హింసను అరికట్టడానికి, దుండగులను అడ్డుకోవడానికి ప్రయత్నించలేదని ఆరోపణలు వచ్చాయి. క్యాంపస్‌ నుంచి పారిపోతున్న దుండుగులను పట్టుకోవడానికి ప్రయత్నించలేదని కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. ఈ విషయంపై కృతి ఎప్పుడో చేసిన ట్వీట్‌ను హైలెట్ చేస్తూ ఇప్పుడు కొంతమంది ట్విట్టర్‌లో ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్‌ చేస్తున్నారు. ఆమె సినిమాను బహిష్కరించాలని ట్విటర్‌ వేదికగా పిలుపునిస్తున్నారు.

* దీపికాకూ తప్పలేదు

జేఎన్‌యూ నిరసనకు సపోర్ట్‌ ఇవ్వడం వల్ల బాలీవుడ్ స్టార్స్ వ్యతిరేకత ఎదుర్కొన్నారు. దాడికి గురైన విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె యూనివర్సిటీకి వెళ్లారు. దీంతో ఆమెకు కూడా సోషల్‌ మీడియాలో వ్యతిరేకత ఎదురైంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Adipurush, JNU, Kriti Sanon, Prabhas, Tollywood

ఉత్తమ కథలు