OTT అనే పదంతో ఇదివరకు అంటే పరిచయం తక్కువే కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడంతా ఇంట్లోనే సినిమాలు చూడ్డానికి అలవాటు పడిపోయారు. కరోనా వచ్చి అందరికీ అదే అలవాటు చేసింది కూడా. ఇదిలా ఉంటే ఇదే అదునుగా తెలుగులోనూ భారీగా ఓటిటి సంస్థలు వచ్చేసాయి. మొన్నటి వరకు కూడా ఇంటర్నేషనల్ కంటెంట్ మాత్రమే నమ్ముకున్న నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు తెలుగులో పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే వాళ్లు అల వైకుంఠపురములో, భీష్మ, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటి సినిమాలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు వెబ్ సిరీస్‌లు కూడా నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే వాళ్ల నుంచి పిట్ట కథలు వస్తుంది. హిందీలో సూపర్ హిట్ అయిన లస్ట్ స్టోరీస్‌కు ఇది రీమేక్. ఇక్కడ కూడా భారీగానే ఈ సిరీస్ వస్తుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్ విడుదలైంది. ఇన్ని రోజులు నెట్ ఫ్లిక్స్ పట్టించుకోకపోయేసరికి తెలుగులో ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా పాగా వేసాయి. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ తమ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే పిట్ట కథలు కోసం చాలా ప్రమోషన్ చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 19న విడుదలకు ముహూర్తం కూడా పెట్టేశారు. ఈ ప్రమోషన్‌లో భాగంగానే తెలుగులో ట్వీట్స్ చేస్తున్నారు నెట్ ఫ్లిక్స్ నిర్వాహకులు. తమ దగ్గర ఒరిజినల్ కంటెంట్ ఉందంటూ ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ టీజర్‌లోనూ ఇదే చూపించారు.
In case you needed a reason to brush up on your Telugu 🥳 pic.twitter.com/v7EJqUjHji
— Netflix India (@NetflixIndia) January 19, 2021
పిట్ట కథలులో శృతి హాసన్, అమలా పాల్, ఈషా రెబ్బా, మంచు లక్ష్మి, జగపతిబాబు, సత్యదేవ్ లాంటి స్టార్ క్యాస్ట్ ఉంది. తెలుగులో నెట్ ఫ్లిక్స్ నుంచి వస్తున్న తొలి భారీ వెబ్ సిరీస్ ఇదే. దాంతో ప్రమోషన్ కూడా అలాగే ఉంది. పైగా ఈ సీరిస్ కోసం నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి లాంటి లీడింగ్ డైరెక్టర్స్ పని చేసారు. బోల్డ్ కంటెంట్ కూడా బోలెడుంది. 'పిట్ట కథలు' గురించి ఊరిస్తూ మాది ఒరిజినల్ కంటెంట్ అంటూ బాగానే హడావిడి చేస్తున్నారు.
Manadi elago 100% Telugu ne kada? Ika brushing-lu avasaram ledu! pic.twitter.com/0DinaFKfOS
— ahavideoIN (@ahavideoIN) January 20, 2021
ఇదిలా ఉంటే 'నెట్ ఫ్లిక్స్'కు ఇప్పుడు ఆహా కౌంటర్ వేసింది. వాళ్లకు అర్థమయ్యేలా.. ‘మా దగ్గర చాలా ఒరిజినల్స్ ఉన్నాయి అరుస్తున్నామా’ అంటూ ట్వీట్ చేసింది. దాంతో ఆహా వర్సెస్ నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ వార్ డిక్లేర్ అయిపోయింది. మరోవైపు ఆహా ఎందుకు కావాలనే గిల్లుతుంది.. నెట్ ఫ్లిక్స్ వాళ్లేదో వాళ్ల ప్రయత్నం చేసుకుంటుంటే ఎందుకు కావాలని టార్గెట్ చేస్తున్నారంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా కూడా రెండు భారీ ఓటిటి సంస్థల మధ్య పోరు మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aha OTT Platform, Netflix, Telugu Cinema, Tollywood