AHA OTT TOP DUB MOVIES IN AHA OTT PLATFORM IN 2021 KNOW THE LIST EVK
OTT Movies: "ఆహా"లో దుమ్మురేపిన డబ్ మూవీస్.. ఈ ఏడాది ఇవే టాప్!
(ప్రతీకాత్మక చిత్రం)
2020 నుంచి ఓటీటీలు ప్రేక్షకులకు చేరువవుతున్నాయి. పూర్తిగా తెలుగు బేస్‌తో ప్రారంభమైన ఓటీటీ ఆహా (AHA). పలు చిత్రాలను, వెబ్ సిరీస్ (Web Series) లను ప్రేక్షకులకు అందిస్తుంది. ఇతర భాషల్లో సినిమాలను కూడా డబ్ చేసి అందిస్తుంది. 2021లో ప్రేక్షకులు మెచ్చిన ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాం (OTT Platform)లో వచ్చిన ఇతర భాషాల్లోంచి వచ్చిన టాప్ డబ్ మూవీస్ ఇవే..
020 నుంచి ఓటీటీలు ప్రేక్షకులకు చేరువవుతున్నాయి. పూర్తిగా తెలుగు బేస్‌తో ప్రారంభమైన ఓటీటీ ఆహా (AHA). పలు చిత్రాలను, వెబ్ సిరీస్ (Web Series) లను ప్రేక్షకులకు అందిస్తుంది. ఇతర భాషల్లో సినిమాలను కూడా డబ్ చేసి అందిస్తుంది. తాజాగా ఈ ఏడాది ఇతర భాషల్లో ఉన్న కాస్సెప్ట్ బేస్డ్ మూవీలను డబ్ చేసి తెలుగు ఆడియన్స్ (Audience) కు పరిచయం చేసింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ మూవీస్‌పై ఆసక్తి కనబర్చారు. 2021లో ప్రేక్షకులు మెచ్చిన ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాం (OTT Platform)లో వచ్చిన ఇతర భాషాల్లోంచి వచ్చిన టాప్ డబ్ మూవీస్ ఇవే..
మిడ్ నైట్ మర్డర్స్ (Midnight Murders)..
ఆహా ఓటీటీలో వచ్చిన మళయాళం సస్పెన్స్, థ్రిలర్ మూవీ మిడ్నైట్ మర్డర్స్. ఈ సినిమా తెలుగు వరుస హత్యల కిల్లర్‌ను పట్టుకొనే నేపథ్యంలో సాగే ఈ సినిమా చివరి నిమిషం వరకు ఉత్కంఠను అందించింది. ఈ సినిమా ఈ ఏడాది ఆహాలో టాప్ డబ్ మూవీలలో ఒకటిగా నిలిచింది.
అనుకోని అతిథి (Anukoni Athidhi)
టాప్ హీరోయిన్ సాయిపల్లవి, టాప్ సౌత్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ నటించిన మళయాళం మూవీ అనుకోని అతిథి. ఈ మళయాళ సినిమాను ఆహా తెలుగులో అందించింది. బేసిక్ లైన్‌తో సాగే ఈ సినిమా.. లోకేషన్లు, కథనం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. నటనలో సాయిపల్లవి ఫహద్ ఫాసిల్ పోటీ పడి నటించారు. ఈ తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది.
బెల్ బాటమ్ (Bell Bottom)
కన్నడలో సూపర్ హిట్ మూవీ బెల్ బాటమ్‌ను ఆహా ఈ ఏడాది తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. హాస్య భరితంగాసాగే డిటెక్టీవ్ కథ ఇది. చివరి వరకు సస్పెన్స్‌తో పాటు హాస్యాన్ని అందించే ఈ సినిమా ఆహా టాప్ డబ్ మూవీలలో ఒకటిగా నిలిచింది.
ఎల్కేజీ (LKG)
తమిళనాడు రాజకీయాలపై సెటైరిక్ సినిమాగా వచ్చిన ఎల్కేజీని ఆహాలో తెలుగులో అందించారు. ఈ సినిమా పోలికల్ డ్రామా బయట జరుగుతున్న రాజకీయాలకు చాలా దగ్గరగా తీశారు. తమిళనాడు రాజకీయాలపై కాస్త అవగాహన ఉన్నవారు ఈ సినిమా తెలుగులో చూసి పుల్ ఎంజాయ్ చేశారు.
36 వయసులో (36 Vayasulo)
తమిళ యాక్టర్ జ్యోతిక లీడ్ రోల్లో నటించిన 36 వయసులో 2015లో తమిళంలో విడుదలైనా.. ఈ సినిమా ఎవ్వరూ తమిళంలో చూసి ఉండరు. ఈ ఏడాది ఆహాలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్త్రీ సమస్యలపై తీసిన ఈ సినిమా.. ఎక్కడా బోరింగ్ లేకుడా సందేశాత్మకంగా అందించారు. సున్నితమైన హాస్యంతో ఆసక్తిక అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు.
కోల్డ్ కేస్ (Cold Case)
మళయాల క్రైమ్ సస్పెన్స్ థ్రిలర్ మూవీ కోల్డ్ కేస్. ఈ సినిమా మళయాళంలో మంచి హిట్ అందుకొంది. మళయాళ వర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తెలుగు వర్షన్ ఆహా అందించింది. చివరి నిమషం వరకు సస్పెన్స్‌తో సాగే ఈ సినిమా ఈ ఏడాది ఆహా టాప్ మూవీలలో ఒక్కటిగా నిలిచింది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.