Chiranjeevi : చిరంజీవి‌ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పిన ఆహా ఓటీటీ..

చిరంజీవి Photo : Twitter

Chiranjeevi : ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' మెగాస్టార్ అభిమానులను క్షమాపణ కోరింది.

  • Share this:
    ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' మెగాస్టార్ అభిమానులను క్షమాపణ కోరింది. వివరాల్లోకి వెలితే... సమంత హోస్ట్‌గా సామ్‌ జామ్‌ అనే  ఓ టాక్ షో ఆహాలో ప్రసారవుతోన్న విషయం తెలిసిందే. ఇందులో అల్లు అరవింద్ కుమారుడు, ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ని సమంత ఇంటర్వ్యూ చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను ఆహా సంస్థ ఇటీవల విడుదల చేసింది. ఇదంతా బాగానే ఉన్న తాజాగా విడుదల చేసిన ఆ ప్రోమోలో అల్లు అర్జున్‌ పేరుకి ముందు స్టైలిష్ స్టార్ అని కాకుండా మెగాస్టార్‌ అని రాశారు. ఇది మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు కోపం తెప్పిచ్చింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ అంటే చిరంజీవి మాత్రమేనని ఈ బిరుదును దక్కించుకునే అర్హత ఏ హీరోకూ లేదని సామాజిక మాధ్యమాల్లో మండిపడుతున్నారు చిరు ఫ్యాన్స్. అంతేకాదు అల్లు అర్జున్‌కు ఇప్పటికే స్టైలిష్‌ స్టార్‌ అన్న బిరుదు ఉందని చెబుతున్నారు. ఇంకొందరైతే సొంత ఓటీటీ సంస్థ ఉంటే ఆ సంస్థ యజమాని కుమారుడికి మెగాస్టార్ అనే చిరంజీవి బిరుదును ఇచ్చేస్తారా? అంటూ ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ఆహా యాజమాన్యంవరకు వెల్లడం.. తప్పుజరిగిందని గుర్తించిన ఆహా సిబ్బంది అల్లుఅర్జున్‌ పేరుకి ముందు మెగాస్టార్‌ అనే ట్యాగ్‌ను తొలగించారు. అంతేకాకుండా అల్లు అర్జున్ పేరుకు ముందు స్టైలిష్‌ స్టార్‌ అన్న ట్యాగ్‌ యాడ్‌ చేసారు.


    ఈ సందర్భంగా ఆహా సంస్థ సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పింది.  ఈ వివాదంపై ఆహా స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా అభిమానులకు క్షమాపణలు చెప్పింది. ఇది సాంకేతిక తప్పిదం మాత్రమేనని పేర్కొంది. అనుకోకుండా ఓ పొరపాటు కారణంగానే మెగాస్టార్ అన్న పేరు వచ్చి, ఇలా జరిగిందని.. కావాలనీ చేసింది కాదని.. ప్రేక్షకులు తమపై ఆదరాభిమానాలను ఇలాగే కొనసాగించాలని కోరింది. ఒకే ఒక మెగాస్టార్ ఉన్నాడని, ఈ విషయం అందరికీ తెలుసని తన ట్వీట్‌లో పేర్కొంది ఆహా.  ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న పుష్పలో నటిస్తున్నాడు. ఈ సినిమాప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇక చిరంజీవి విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న ఆచార్యలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చిరంజీవి వేదాళం రీమేక్‌లో నటించనున్నాడు. ఈ సినిమాకు మెహెర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు.
    Published by:Suresh Rachamalla
    First published: