హీరోగా వరుస పరాజయాల్లో ఉన్న అఖిల్ అక్కినేనికి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో కథానాయకుడిగా తొలి సక్సెస్‌ను అందుకున్నారు. గతేడాది బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో సాప్ట్ రోల్లో కనిపించిన అఖిల్.. ఇపుడు ఏజెంట్ సినిమా కోసం పూర్తిగా ట్రాన్స్‌ఫామ్ అయ్యాడు. ఏజెంట్ (Agent)పేరుతో వస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఈ చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని భారీగా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మరో ముఖ్యపాత్రలో నటిస్తుండంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
తాజాగా ‘ఏజెంట్’ సినిమాకు టీజర్‌ను వివిధ భాషల్లో ఏక కాలంలో విడుదల చేశారు. ఈ టీజర్ హాలీవుడ్ రేంజ్‌లో ఉంది. డైరెక్టర్‌గా సురేందర్ రెడ్డి టేకింగ్ అదుర్స్ అనేలా ఉంది. పిక్చరైజైషనే కేక పుట్టిస్తోంది. అఖిల్ గెటప్ కూడా హాలీవుడ్ రేంజ్ లెవల్లో ఉంది. కొన్ని సీన్స్ ఆర్నాల్డ్ లెవల్లో ఉన్నాయి. ఈ సినిమా కోసం తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు. ఎయిట్ ప్యాక్‌తో సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాతో అఖిల్ మాస్ హీరోగా సత్తా చాటడం పక్కా అని చెప్పొచ్చు.
Presenting an amalgam of ACTION and ADVENTURE in #AGENT way ????
The Power Packed #AgentTeaser out now????
- https://t.co/IMEHRFSXU4
ఏజెంట్・एजेंट・ஏஜென்ட்・ഏജന്റ്・ಏಜೆಂಟ್@AkhilAkkineni8 @mammukka @DirSurender @sakshivaidya99 @hiphoptamizha @AnilSunkara1 @S2C_Offl @LahariMusic pic.twitter.com/6p5GUZjCnu
— AK Entertainments (@AKentsOfficial) July 15, 2022
ఇక విషయం ఏమంటే అఖిల్ ఈ చిత్రానికి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. సినిమా క్వాలిటీ ముఖ్యమని.. అందులో భాగంగా ప్రస్తుతం ఆయన ఎటువంటీ రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదని అంటున్నారు. అయితే ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లలో వాటా తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. అఖిల్ ఈ చిత్రం కోసం కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. స్టైలీష్ లుక్‌లో కండలు తిరిగిన దేహంతో సరికొత్తగా కనిపిస్తున్నారు.
ఈ సినిమాను అన్ని భాషల్లో కలిపి రూ. 60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ థియేట్రికల్ బిజినెస్ చేసినట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు కూడా భారీ రేటుకు అమ్మడుపోయినట్టు సమాచారం. మొత్తంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సక్సెస్ తర్వాత ఏజెంట్‌గా వస్తోన్న అఖిల్ ఈ సినిమాతో భారీ సక్సెస్ అందుకుంటారా లేదా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agent Movie, Akhil Akkineni, Surender reddy, Tollywood