హోమ్ /వార్తలు /సినిమా /

Akhil Akkineni : అఖిల్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన ఏజెంట్ నిర్మాత అనిల్ సుంకర..

Akhil Akkineni : అఖిల్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన ఏజెంట్ నిర్మాత అనిల్ సుంకర..

Akhil Akkineni : అఖిల్ అక్కినేని (Akhil Akkineni ) మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్  (Most Eligible Bachelor) తర్వాత నటిస్తున్న చిత్రం ఏజెంట్. అది అలా ఉంటే ఈ సినిమా నిర్మాత అనిల్ సుంకర అక్కినేని అభిమానులకు క్షమాపణలు చెప్పారు. తన సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్ట్ చేస్తూ ‘అక్కినేని ఫ్యాన్స్ కు సారీ’ అంటూ ట్వీట్ చేశారు.

ఇంకా చదవండి ...

  అఖిల్ అక్కినేని (Akhil Akkineni ) మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్  (Most Eligible Bachelor) తర్వాత నటిస్తున్న చిత్రం ఏజెంట్. అది అలా ఉంటే ఈ సినిమా నిర్మాత అనిల్ సుంకర (Anil Sunkara) అక్కినేని అభిమానులకు క్షమాపణలు చెప్పారు. తన సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్ట్ చేస్తూ ‘అక్కినేని ఫ్యాన్స్ కు సారీ’ అంటూ ట్వీట్ చేశారు. ఇవాళ అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ‘ఏజెంట్’ టీజర్‌ను రిలీజ్ చేయాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఆ టీజర్‌ను విడుదల చేయలేకపోయారు. దీంతో అక్కినేని అభిమానులకు అనిల్ సుంకర సారీ చెబుతూ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్‌లో రాస్తూ.. మేం అభిమానులు కోరుకున్న దానికన్నా మించి టీజర్‌ను ఇవ్వాలనీ భావించాం. అందుకే ఇప్పుడుఇవ్వలేకపోతున్నాం అన్నారు. అయితే వచ్చే నెల దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేస్తామని తెలిపారు. ఇక ఈ సినిమా విడుదల విషయంలో టీమ్ ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చింది. ఏజెంట్ (Agent) చిత్రం ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు వస్తుందని వెల్లడించింది టీమ్. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టయిన్ మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర, సురేందర్ రెడ్డి (Surender reddy) నిర్మిస్తున్నారు. ఏజెంట్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సిక్స్ ప్యాక్‌తో దర్శనమివ్వనున్నారు. స్పై థ్రిల్ల‌ర్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని భారీగా పాన్ ఇండియా స్కేల్ మీద తెర‌కెక్కించాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌. ఈ చిత్రానికి అఖిల్ (Akhil Akkineni) రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డం లేద‌ట. సినిమా క్వాలిటీ ముఖ్యమని.. అందులో భాగంగా ప్రస్తుతం ఆయన ఎటువంటీ రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదని అంటున్నారట. అయితే ఈ సినిమాకు వ‌చ్చిన క‌లెక్ష‌న్ల‌లో వాటా తీసుకుంటున్న‌ట్లు టాక్ నడుస్తోంది.

  ఇక అఖిల్ ఈ (Agent) చిత్రం కోసం కంప్లీట్‌గా మేకోవ‌ర్ అయ్యారు. స్టైలీష్ లుక్‌లో కండ‌లు తిరిగిన దేహంతో సరికొత్తగా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ రా ఏజెంట్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అఖిల్‌కు జోడిగా కొత్త అమ్మాయి సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. మొన్నటి వరకు ఈ సినిమా యూరప్‌లో షూటింగ్ జరుపుకుంది. యూరప్‌లోని హంగేరీలో రాజధాని బుడాపెస్ట్ (Budapest )లో షూటింగ్ చేసింది టీమ్. ఈ సినిమాలో మలయాళీ సూపర్ స్టార్ మ‌మ్ముట్టి (Mammootty) కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో సాక్షితో పాటు అతుల్య రవి కూడా మరో హీరోయిన్‌గా చేస్తున్నారు.

  ఇక ఆయన గత చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ (Most Eligible Bachelor)  విషయానికి వస్తే.. ఈ సినిమాలో (Pooja Hegde )పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ గత సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకంగా మారింది. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకంగా మారింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అందరి అంచనాలను మించి పోయే కలెక్షన్స్‌ను సొంతం చేసుకుని దుమ్ములేపింది.

  First published:

  Tags: Agent, Akhil Akkineni

  ఉత్తమ కథలు