HOME »NEWS »MOVIE »age gap between tollywood singer sunitha ram veerapaneni and here the details pk

Singer Sunitha Ram Veerapaneni: సింగర్ సునీత, ఆమె భర్త రామ్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..?

Singer Sunitha Ram Veerapaneni: సింగర్ సునీత, ఆమె భర్త రామ్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..?
సింగర్ సునీత (Photo : upadrastasunitha/Instagram)

Singer Sunitha Ram Veerapaneni: టాలీవుడ్ ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత రెండో పెళ్లి ఈ మధ్యే ఘనంగా జరిగింది. జనవరి 9న ఈమె ప్రముఖ మీడియా వ్యాపారవేత్త.. మ్యాంగో రామ్‌ను పెళ్లి చేసుకుంది. ఈయన డిజిటల్ మీడియాలో మొఘల్ లాంటి వాడు.

  • Share this:
టాలీవుడ్ ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత రెండో పెళ్లి ఈ మధ్యే ఘనంగా జరిగింది. జనవరి 9న ఈమె ప్రముఖ మీడియా వ్యాపారవేత్త.. మ్యాంగో రామ్‌ను పెళ్లి చేసుకుంది. ఈయన డిజిటల్ మీడియాలో మొఘల్ లాంటి వాడు. ఎన్నో ఏళ్లుగా అక్కడే ఉండి పాతుకుపోయాడు. మ్యాంగో అధినేత రామ్ వీరపనేనికి ఆస్తులు కూడా చాలానే ఉన్నాయి. ఈయనతో పరిచయం స్నేహంగా మారి చివరికి ప్రేమతో పెళ్లి చేసుకుంది సునీత. ఈ ఇద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. సునీత రెండో పెళ్లి చేసుకుంటుందని తెలియగానే చాలా మంది వరుడు ఎవరు.. ఎక్కడ్నుంచి వచ్చాడు అనే దానికంటే కూడా రామ్ వయసు ఎంత అనేది కూడా సర్చ్ చేసారు. రామ్ వీరపనేని వయసు ఎంత.. సునీతకు ఆయనకు వయసులో ఎంత గ్యాప్ ఉంది అనేది చాలా మంది వెతికారు కూడా. దీనికి సమాధానం కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. రామ్ వీరపనేని వయసు 47 ఏళ్ళు. ఈయన మే 26, 1974న జన్మించాడు. సునీత వయసు 42 ఏళ్ళు. ఈ ఇద్దరి వయసులో కేవలం ఐదేళ్లు మాత్రమే గ్యాప్ ఉంది. ముందు నుంచి కూడా ఇద్దరూ మంచి స్నేహితులు. పైగా వయసు గ్యాప్ కూడా తక్కువగానే ఉండటంతో పెళ్లి వరకు అడుగులు వేసారు. రామ్ పూర్తి పేరు రామకృష్ట వీరపనేని. ఆస్ట్రేలియాలో చదువుకుని ఇండియాకు వచ్చాడు. ఇక్కడికి వచ్చి వ్యాపారవేత్తగా స్థిరపడ్డాడు. రామ్ వీరపనేనికి ప్రముఖ కంపెనీల్లో కొన్ని వందల కోట్ల రూపాయల విలువ చేసే షేర్‌లు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.
Singer Sunitha Marriage photos,anchor suma sunitha marriage,Singer Sunitha ram veerapaneni wedding,sunitha husband ram veerapaneni assets,singer sunitha ram veerapaneni assets,సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని,రామ్ వీరపనేని ఆస్తులు,సింగర్ సునీత భర్త రామ్ ఆస్తుల వివరాలు
సింగర్ సునీత, రామ్ పెళ్లి (Singer Sunitha Ram marriage)




మాంగో మ్యూజిక్‌కు సునీత ఎన్నో పాటలు పాడింది. అప్పట్నుంచి వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత సునీత స్వయంగా కోరడంతో స్నేహం నుంచి దాంపత్యం వైపు అడుగులేసారు. మొదట్నుంచి కూడా సోషల్ మీడియాకు కానీ.. హంగామాకు గానీ దూరంగానే ఉన్నాడు రామ్. ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను ఇతర భాషల నుంచి తీసుకుని మ్యాంగోలో విడుదల చేసాడు. అలా కోట్లాది రూపాయలను సంపాదించాడు. అలాగే కెరీర్ ప్రారంభంలో నటుడిగా కూడా ఉన్నాడు రామ్.
singer sunitha,singer sunitha twitter,singer sunitha instagram,singer sunitha movies,singer sunitha coffee cup,singer sunitha insta posts,singer sunitha ram veerapaneni,singer sunitha husband ram veerapaneni,telugu cinema,సింగర్ సునీత,సింగర్ సునీత రామ్ వీరపనేని,సింగర్ సునీత కాఫీ కప్
సింగర్ సునీత (Singer Sunitha)

జగపతిబాబు స్వప్నలోకం, వెంకటేష్ జయం మనదేరా, మహేష్ బాబు బాబీ లాంటి సినిమాల్లో నటించాడు ఈయన. ఆ తర్వాత బిజినెస్ వైపు వచ్చాడు. అలా ఇక్కడ పెట్టుబడి పెట్టి వందల కోట్ల రూపాయలు ఆర్జించాడు. ఈయన ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ లెక్కల ప్రకారం ఈయన షేర్‌ల వ్యాల్యూ వందల కోట్లు ఉంటుందని తెలుస్తుంది. అలాగే తెలంగాణ, ఆంధ్రలోని చాలా మంది రాజకీయ నాయకులతో కూడా రామ్ వీరపనేనికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఏదేమైనా కూడా రామ్, సునీత మధ్య వయసు తేడా ఐదేళ్లు మాత్రమే ఉంది.
Published by:Praveen Kumar Vadla
First published:January 19, 2021, 23:09 IST

टॉप स्टोरीज