పెళ్లి సరే...దీపికా, రణ్‌వీర్ వెడ్డింగ్ రిసెప్షన్ ఎపుడో తెలుసా..!

బాలీవుడ్ స్టార్ జంట దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్ పెళ్లి సందడి ఇప్పటికే ప్రారంభమైంది. వీరిద్దరి మరికొన్ని గంటల్లో ఒకటవుతున్నారు. పెళ్లికి ఒక రోజు ముందు వీరి రిసెప్షన్ కార్డ్  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇటలీలో రెండు రోజుల పెళ్లి తర్వాత వీళ్లిద్దరు ఈ నెల 28న ముంబాయిలో గ్రాండ్ హాయత్ హోటల్లో వీరి రిసెప్షన్ జరగనుంది.

news18-telugu
Updated: November 13, 2018, 11:50 AM IST
పెళ్లి సరే...దీపికా, రణ్‌వీర్ వెడ్డింగ్ రిసెప్షన్ ఎపుడో తెలుసా..!
దీప్‌వీర్ వెడ్డింగ్ రిసెప్షన్
  • Share this:
బాలీవుడ్ స్టార్ జంట దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్ పెళ్లి సందడి ఇప్పటికే ప్రారంభమైంది. వీరిద్దరి మరికొన్ని గంటల్లో ఒకటవుతున్నారు.  ఈ ఆన్‌స్క్రీన్ ‘మస్తానీ’ని పెళ్లి కునేందుకు ప్రత్యేకంగా మంగళసూత్రం తయారుచేయించాడు ఆన్‌స్క్రీన్ ‘బాజీరావు. తాళి కోసం 20 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు రణ్‌వీర్. గురు, శుక్రవారాల్లో జరిగే వీరి వివాహం దక్షిణాది, ఉత్తరాది రెండు పద్దతుల్లో జరగనుంది. అంతేకాదు వీరి వివాహా విందులో భారతీయ వంటకాలతో పాటు కాంటినెంటల్ వంటకాలను వడ్డించబోతున్నట్టు సమాచారం.

వీరి వివాహం ఇటలీలోని అత్యంత సుందరమైన లేక్‌కోమోలో జరగనుంది. 18వ శ‌తాబ్దానికి చెందిన దేల్ బాల్బియానెల్లో విల్లాను ఈ జంట త‌మ పెళ్లి కోసం బుక్ చేసుకుంది. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలకు చెందిన కొంత మంది వ్యక్తులతో పాటు బాలీవుడ్‌కు చెందిన అత్యంత సన్నిహితులు హాజరయ్యే అవకాశం ఉంది.

దీప్‌వీర్ వెడ్డింగ్ రిసెప్షన్ కార్డ్


పెళ్లికి ఒక రోజు ముందు వీరి రిసెప్షన్ కార్డ్  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇటలీలో రెండు రోజుల పెళ్లి తర్వాత వీళ్లిద్దరు ఈ నెల 28న ముంబాయిలో గ్రాండ్ హాయత్ హోటల్లో వీరి రిసెప్షన్ జరగనుంది. రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ విందుకు బాలీవుడ్‌ సహా పలు రంగాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇటలీలో జరగబోయే వీళ్లిద్దరి వివాహంతో పాటు ముంబాయిలో జరిగే రిసెప్షన్ సహా అన్ని కార్యాక్రమాలను ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్  వర్ధన మోహన్ దగ్గరుండి  చూసుకుంటుంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 13, 2018, 11:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading