జబర్దస్త్‌లో మళ్లీ అదే ఫార్ములా... కలిసొస్తుందా?

Jabardasth Comedy Show : తెలుగు వారికి నవ్వుల పువ్వులు పూయిస్తున్న జబర్దస్త్ కామెడీ షో... కొన్ని అంశాల్లో మాత్రం విమర్శలు ఎదుర్కొంటోంది. అవేంటో తెలుసుకుందాం.

news18-telugu
Updated: December 14, 2019, 9:46 AM IST
జబర్దస్త్‌లో మళ్లీ అదే ఫార్ములా... కలిసొస్తుందా?
100 సినిమాలకు పైగా నటించినా కూడా బుల్లితెరపై రోజా ఈ స్థాయిలో హవా చూపించడానికి కారణం జబర్దస్త్ కామెడీ షో. అప్పటికి రాజకీయాల్లో కూడా రోజా పెద్దగా యాక్టివ్‌గా లేదు. అలాంటి సమయంలో ఈమెకు లైఫ్ ఇచ్చింది జబర్దస్త్ కామెడీ షో. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచింది.. రెండుసార్లు ఎమ్మెల్యే కూడా అయింది రోజా.
  • Share this:
Jabardasth Comedy Show : నవ్వు నాలుగు విధాలా ఆరోగ్యమే. కానీ... ఇతరుల్ని కించపరుస్తూ... కామెడీ చేస్తే... అది సరైన కామెడీ అనిపించుకోంది. తెలుగువారిని ఎంతగానో నవ్వించే జబర్దస్త్ కామెడీ షో, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో... కొన్ని విషయాల్లో విమర్శలపాలవుతోంది. ఆరేళ్ల కిందట ఈ షో ప్రారంభించినప్పుడు... పచ్చి బూతు పురాణంలా ఉందని చాలా మంది విమర్శించారు. ఆ తర్వాత జబర్దస్త్ జడ్జిగా ఉన్న నాగబాబు... ఈ పరిస్థితికి చెక్ పెట్టారు. వీలైనంతవరకూ అశ్లీలత, బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్, బీప్ శబ్దాలు తగ్గిస్తూ... పిల్లలు కూడా చూసే విధంగా ఈ షోని మలిచారు. దాంతో... విమర్శల నుంచీ జబర్దస్త్ కామెడీ షో... మంచి షోగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు నాగబాబు వెళ్లిపోవడంతో... మళ్లీ టీమ్ లీడర్లు, కంటెస్టెంట్ల ఇష్టారాజ్యమైపోతోందా? ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఇబ్బందికరమైన కామెడీని ప్రదర్శిస్తున్నారా?

ఇటీవల మూడు వారాలుగా జబర్దస్త్ కామెడీ షో, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షోల్లో... మళ్లీ పాత ఫార్ములా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోందన్న విమర్శలున్నాయి. అదే పనిగా పక్క వారిని నల్లగా వున్నావు, నీ మొహం అద్దంలో చూసుకో, నీ మొహానికీ ఆ బర్రెకీ తేడా తెలియట్లేదు... లాంటి వర్ణ వివక్షను చూపిస్తూ... కామెడీ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇదే కాదు. లారీ డ్రైవర్లను విటులుగా చూపిస్తున్నారన్న మరో విమర్శ ఉంది. మాటిమాటికీ... లారీ డ్రైవర్ల దగ్గరకు అమ్మాయిలు వెళ్తారన్నట్లుగా చూపించడంపై అభ్యంతరాలు వస్తున్నాయి. అంతే కాదు... నీ హైట్ చూసుకున్నావా... అంటూ... మరుగుజ్జు తనాన్ని ఎత్తి చూపిస్తున్నారు. మరుగుజ్జు తనాన్ని అవమానించడం ద్వారా... అలాంటి వారిని అవమానించినట్లే అవుతుంది. ఇలా వ్యక్తుల స్వాభిమానాన్ని దెబ్బతీస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ రెండు షోలూ ఎవర్నీ ఉద్దేశించి చేయట్లేదు అంటూనే... ఇలాంటి సామాజిక అంశాల్లో వివక్ష చూపించడం కరెక్టు కాదనే చెప్పుకోవచ్చు. కామెడీ పండించడం కష్టమే. అందులోనూ వారం వారం కొత్త కొత్త కాన్సెప్టులు ఆలోచించి, వాటిని తెరపైకి తెచ్చి... నవ్వు తెప్పించేలా చెయ్యడం ఎంతో శ్రమతో కూడిన అంశమే. అలాగని... కామెడీ చేస్తూనే... ఇలాంటి వివక్షా పూరిత అంశాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే... షోకీ మంచి పేరు వస్తుంది, అదే సమయంలో... ఎవరూ అభ్యంతరంగా ఫీలయ్యే పరిస్థితి కూడా ఉండదంటున్నారు విశ్లేషకులు. ఈ విషయంలో ప్రస్తుతం జబర్దస్త్ జడ్జిగా ఉన్న ఎమ్మెల్యే రోజా... కాస్త దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

 


Pics : బాలీవుడ్‌ వైపు చూస్తున్న అనుష్కా సేన్
ఇవి కూడా చదవండి : 

రైల్వే లోకో పైలెట్లకు ఫాగ్‌పాస్ యంత్రాలు... ఏంటి వాటి ప్రత్యేకత?

భర్తను చంపేందుకు భార్య షాకింగ్ ప్లాన్... చివరకు...

కూతురి పెళ్లి వేడుకలో తండ్రి గుండెపోటుతో మృతి

శభాష్ తెలంగాణ పోలీస్... మెచ్చుకున్న ఏపీ ప్రయాణికుడు

ఆయేషా మీరా కేసులో ట్విస్ట్... సీబీఐ సంచలన నిర్ణయందిశ చట్టంలో ఏముంది? కీలక పాయింట్లు ఇవీ...
First published: December 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>