Home /News /movies /

AGAIN STARTS VANTALAKKA FAMILY PROBLEMS IN TODAYS KARTHIKA DEEPAM SERIAL EPISODE NR

Karthika Deepam: మళ్లీ మొదటికి వచ్చిన కార్తీకదీపం.. వంటలక్క కష్టాలు పగవాడికి కూడా రాకూడదు దేవుడా

karthika deepam

karthika deepam

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. సీరియల్ ప్రారంభం నుండి ఎంతో ఆసక్తిగా ఉండగా ఒకే కథ ఎన్నో ట్విస్టులతో సాగుతుంది. ఇక హిమ, సౌర్య ల ఫ్రెండ్ తమ డాడీ గురించి చెడుగా మాట్లాడటంతో హిమ బాగా ఏడుస్తూ ఉంటుంది.

ఇంకా చదవండి ...
    Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. సీరియల్ ప్రారంభం నుండి ఎంతో ఆసక్తిగా ఉండగా ఒకే కథ ఎన్నో ట్విస్టులతో సాగుతుంది. ఇక హిమ, సౌర్య ల ఫ్రెండ్ తమ డాడీ గురించి చెడుగా మాట్లాడటంతో హిమ బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇక సౌర్య ధైర్యం చెప్పి ఓదార్చుతుంది. అంతలోనే కార్తీక్ రావడంతో వాళ్లను రమ్మని పిలుస్తాడు. ఇక పిల్లలు కారులో తన పక్కన కూర్చోకుండా వెనకాల సీట్ లో కూర్చునే సరికి కార్తీక్ బాధపడతాడు.

    కారులో పిల్లలు నిశ్శబ్దంగా ఉండటం చూసి ఏమైంది అంటూ కబుర్లు చెప్తారని, ఏమైనా ప్రశ్నలు వేస్తారని అనుకుంటే ఇలా ఎందుకు ఉన్నారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. అయినా పిల్లలు మాట్లాడకుండా అలాగే ఉంటారు. సౌందర్య గతంలో మోనిత విషయాలను తలచుకుండగా.. అంత లోనే దీప వస్తుంది. ఇక దీప ఏడుస్తూ వారణాసి బస్తీలో డాక్టర్ బాబు గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు అని అనడంతో సౌందర్య ఓదారుస్తుంది.

    ఇది కూడా చదవండి: జైల్లో మోనితకు మరో సపోర్ట్.. మళ్ళీ అవమానల్లో నలిగిపోతున్న వంటలక్క కుటుంబం!

    మరోవైపు హిమ స్కూల్ లో తన ఫ్రెండ్ మాట్లాడిన మాటలు తలుచుకొని బాధపడుతుంది. డాడీ గురించి వాళ్లు ఎందుకు అలా అంటున్నారు అని బాగా ఏడుస్తుంది. ఇక సౌందర్య పువ్వులు గుచ్చుతున్న సమయంలో కార్తీక్ వచ్చి దిగులుగా మాట్లాడుతాడు. పరిస్థితులు ఎప్పటికీ మారవు అని అంటాడు. పిల్లలు తనతో మాట్లాడలేదని సౌందర్యతో చెప్పుకుంటూ బాధపడతాడు. కారులో తన పక్కన కూడా కూర్చోలేదంటూ ఒక్కరు కూడా మాట్లాడలేదు అంటూ ఎందుకో బాధగా కనిపిస్తున్నారు అని అనడంతో.. అదే సమయంలో అక్కడికి సౌర్య వచ్చి వాటర్ బాటిల్ తీసుకెళుతుంది.

    ఇది కూడా చదవండి:తెలివిలేని వంటలక్క, డాక్టర్ బాబు.. అదే సైకో ప్లాన్స్‌తో మోనిత ఎత్తుగడలు

    సౌందర్య సౌర్య ను పిలిచి అడుగుదామనేసరికి ఆ హిమ వస్తున్నా అంటూ..హిమ పిలువక ముందుకే పిలిచినట్లు వెళ్తుంది. సౌందర్య సౌర్య ను ఎంత పిలిచినా కూడా పలకకుండా వెళ్లి పోయేసరికి కార్తీక్ చూసి బాధపడతాడు. మరోవైపు దీప గతంలో మోనిత ప్రెగ్నెంట్ అనే విషయాన్ని బాధపడి చెప్పిన విషయాలు తలచుకుంటూ ఆలోచనలో పడుతుంది. తరువాయి భాగంలో హిమ, సౌర్య లు ఏడవటంతో ఎందుకు ఏడుస్తున్నారు అని దీప కోపంగా అడగటం తో.. స్కూల్లో అందరూ డాడీ, మోనిత ఆంటీ గురించి మాట్లాడుకుంటున్నారని డాడీ గురించి చెడుగా అంటున్నారు అని బాధపడుతూ ఏడుస్తారు. దీనిని బట్టి చూస్తే ఈ సీరియల్ మళ్లీ మొదటికి వచ్చినట్లు అనిపిస్తుంది. ఇక వీరి జీవితాల్లో సంతోషాలు అనేవే ఉండేవేమో అనిపిస్తుంది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Archana ananth, Doctor babu, Karthika deepam, Monitha, Nirupam paritala, Premi Viswanath, Shobashetty, Soundarya, Vantalakka

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు