Again confusion on RRR release date and Rajamouli will give clarity
RRR - Rajamouli: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను దసరా సందర్భంగా విడుదల చేస్తామని యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ డేట్ మరోసారి వాయిదా పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్లో రూపొందుతోన్నపాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్(రణం రౌద్రం రుధిరం)’. గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్ 13న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకవైపు ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. వచ్చే నెల వరకు షూటింగ్ ఉండొచ్చునని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు సినిమా వి.ఎఫ్.ఎక్స్ పూర్తి కావాల్సి ఉంది. ఒకవైపు వి.ఎఫ్.ఎక్స్‌కు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజమౌళి సినిమా ఔట్పుట్ విషయంలో కాంప్రమైజ్ కాడు. మరి ఇంత తక్కువ సమయంలో ‘ఆర్ఆర్ఆర్’ థియేటర్స్‌ను తాకుతుందా? అనేది అందరిలోనూ నెలకొన్న అనుమానం
అయితే ట్రేడ్ వర్గాల్లో కొందరు మాత్రం దాదాపు ‘ఆర్ఆర్ఆర్’ అనుకున్న సమయానికి విడుదల కాకపోవచ్చునని అంటున్నారు. అందుకు కారణం.. ఇంకా వర్క్ ఉండటమే కాకుండా.. ఇంత భారీ బడ్జెట్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే క్రమంలో రాజమౌళి అంత ఉదాసీనంగా ఉండడని అంటున్నారు. దీని ప్రకారం చూస్తే.. ‘ఆర్ఆర్ఆర్’ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావాలి. అయితే ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతి సీట్స్‌ను పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, సూపర్‌స్టార్ మహేశ్ ఆక్రమించుకున్నారు. ఒకవేళ వీరిద్దరిలో ఒకరు వెనక్కి వెళితే రాజమౌళి వచ్చేస్తాడు. లేకపోతే ‘ఆర్ఆర్ఆర్’ను వచ్చే ఏడాది సమ్మర్లోనే విడుదల చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. వచ్చే ఏడాది సమ్మర్లోనే ‘ఆర్ఆర్ఆర్’ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై జక్కన్న అండ్ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
బాహుబలి వంటి సెన్సేషనల్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. 1920 బ్యాక్‌డ్రాప్‌లో సాగే రెండు నిజమైన పాత్రలకు సంబంధించిన ఫిక్షనల్ పీరియాడికల్ మూవీ. ప్రస్తుతం నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ క్లైమాక్స్ ఫైట్‌ను జక్కన్న అండ్ టీమ్ రూపొందిస్తుంది.v
Published by:Anil
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.