టాలీవుడ్లో నాగ చైతన్య, సమంత జంటకు మంచి క్రేజ్ ఉంది. వీళ్లిద్దరు తొలిసారి ’ఏమాయ చేసావే’లో కలిసి నటించారు. తాజాగా నాగ చైతన్య సమంతకు ఇష్టమైన పాటను ఏంటో అభిమానులతో పంచుకున్నాడు.
టాలీవుడ్లో నాగ చైతన్య, సమంత జంటకు మంచి క్రేజ్ ఉంది. వీళ్లిద్దరు తొలిసారి ’ఏమాయ చేసావే’లో కలిసి నటించారు. ఫస్ట్ సినిమాతో ఏర్పడ్డ ప్రేమ ఆ తర్వాత పెళ్లికి దారి తీసింది. పెళ్లి తర్వాత వీళ్లిద్దరు తొలిసారి ‘మజిలీ’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత నాగ చైతన్య, సమంత కలిసి నటించలేదు. మజిలీ సినిమా తర్వాత సమంత.. ‘ఓ బేబి’ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. మరోవైపు నాగచైతన్య తన మేనమామ వెంకటేష్‌తో కలిసి నటించిన ‘వెంకీ మామ’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే నమోదు చేసింది. ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చైతూ సరసన రౌడీ బేబి సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో ‘ఏ పిల్ల అనే పాటను మార్చి 11న (బుధవారం) సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ.. సమంతకు తామిద్దరం తొలిసారి యాక్ట్ చేసిన ‘ఏమాయ చేసావే’ సినిమాలోని ‘ఈ హృదయం కరిగించి వెళ్లకే’ పాటంటే చాలా ఇష్టమని చెప్పాడు. ఈ విషయాన్ని సమంత కూడా ట్విట్టర్ వేదికగా ఔనని చెప్పింది.
ఈ నేపథ్యంలో చైతన్య ఓ ట్వీట్ చేశాడు. మీకు ఇష్టమైన ప్రేమ పాట ఏంటి ? అని నెటిజన్లను అడిగాడు. ఇక నాకు మాత్రం చాలా ఇష్టమైన ప్రేమ పాటల్లో సాహసం శ్వాసగా సాగిపో’ లోని వెళ్లిపోమాకే... పాటంటే ఇష్టమని చెప్పాడు. అలాగే మీరు కూడా మీకిష్టమైన పాట ఏమిటో చెప్పండి అని #myfavlovesong అనే ట్యాగ్‌ను ట్వీట్ చేశాడు. ఈ విషయమై చాలా మంది నెటిజన్స్ చైతూకు రిప్లై ఇచ్చారు. అంతేకాదు తమకిష్టమైన పాటలు తెలిపిన వారికి ఓ మరిచిపోలేని సర్ఫ్రైజ్ గిప్ట్ ఉంటుందిని చిత్ర బృందం తెలిపింది.
One of my most favorite love songs ever is “Velipomaake” from Saahasam Swaasaga Saagipo. Send me yours with #myfavlovesong Get started!!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.