హోమ్ /వార్తలు /సినిమా /

అపుడు విజయ్ ‘సర్కార్’..ఇపుడు విశాల్ ‘అయోగ్య’

అపుడు విజయ్ ‘సర్కార్’..ఇపుడు విశాల్ ‘అయోగ్య’

విజయ్, విశాల్ (ఫైల్ ఫోటో)

విజయ్, విశాల్ (ఫైల్ ఫోటో)

గత కొన్నేళ్లుగా ఏ సినిమా తీసుకున్నా..ఏదో ఒక వివాదం సినిమా తీసినవాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ ఫస్ట్ లుక్‌లో విశాల్..బీర్ బాటిల్ పట్టుకొని పోలీస్ జీపుపై కూర్చోని వున్న పోస్టర్ వివాదాన్ని రాజేసింది.

  గత కొన్నేళ్లుగా ఏ సినిమా తీసుకున్నా..ఏదో ఒక వివాదం సినిమా తీసినవాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.  ప్రస్తుతం తమిళ హీరో విశాల్..తెలుగులో ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టెంపర్’ మూవీని రీమేక్ చేస్తున్నాడు. తమిళంలో ఈ మూవీకి ‘అయోగ్య’ అనే టైటిల్ ఖరారు చేసారు. రీసెంట్‌గా ‘అయోగ్య’ మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసారు. ఐతే..ఈ ఫస్ట్ లుక్‌లో విశాల్..బీర్ బాటిల్ పట్టుకొని పోలీస్ జీపుపై కూర్చోని వున్న పోస్టర్ వివాదాన్ని రాజేసింది.

  వెంకట్ మోహన్ అనే నూతన దర్శకుడు డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో రాశిఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ పోస్టర్‌తో సభ్య సమాజానికి విశాల్ ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ ఎస్. రామదాస్ తన ట్వీట్లతో విశాల్‌పై విరుచుకు పడ్డాడు. పైగా నడిగర్ సంఘం సెక్రటరీగా విశాల్‌కు సామాజిక బాధ్యత ఉందని గుర్తు చేశారు.

  గతంలో విజయ్ హీరోగా నటించిన ‘సర్కార్’ మూవీ పోస్టర్‌పై పీఎమ్‌కే నేత అన్బుమణి రామ్‌దాస్ ఈ రకంగానే మండిపడ్డ సంగతి తెలిసిందే కదా. అంతకు ముందు  ‘బాబా’ సినిమాలో రజినీ సిగరెట్ తాగే పోస్టర్స్ విషయంలో రామ్‌దాస్ తలైవాపై  ఈ రకంగా ఒంటికాలిపై లేచారు. మరోవైపు హీరోలను అభిమానులు ఆదర్శంగా తీసుకుంటారని, సినిమాలో వాళ్లు మద్యం, పొగ తాగితే అది మంచిదనుకొని వారు కూడా తాగడం మొదలు

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Kollywood, Vijay, Vishal